ఇద్దరి సీఎంలపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

Updated By ManamWed, 03/14/2018 - 18:01
 CPI Narayana, AP CM chandrababu naidu, Telangana CM KCR

 CPI Narayana, AP CM chandrababu naidu, Telangana CM KCRన్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిని తప్పుబట్టారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ఆయన వ్యతిరేకించారు. బీజేపీ విషయంలో రాజకీయంగా నిర్ణయం తీసుకునేందుకు బాబు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి టీడీపీ మంత్రులను తొలగించి ఎన్‌డీఏలో ఏవిధంగా కొనసాగుతారని చంద్రబాబును ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తుందని గుర్తించడానికి బాబుకు నాలుగేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదని నారాయణ అన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాడాలని ఏపీ సీఎంకు సూచించారు. ప్యాకేజీ ఇచ్చినా నిధులు ఖర్చు చేసే సమయం లేదని నారాయణ చెప్పారు. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తుందని నారాయణ విమర్శించారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని సస్పెండ్‌ చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని నారాయణ ఆరోపించారు.

English Title
CPI Narayana Slams AP CM, Telangana CM
Related News