ధర్మానను ఇరికించే ప్రయత్నం...

Updated By ManamFri, 11/09/2018 - 13:21
dharmana prasada rao
  • చంద్రబాబు జిమిక్స్ మానుకోవాలి

  • ‘హ్యాపీ నెస్ట్’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం

CPI Rama Krishna

విజయవాడ : విశాఖలో జరిగిన భూ కుంభకోణంలో సిట్ ఇన్ని నెలలు కాలయాపన చేసి... చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ..‘ ఈ స్కాంలో అధికార పార్టీ నాయకులను వదిలేసి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. సిట్‌పై ప్రజలకు నమ్మకం పోయింది. 

విశాఖ భూకుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలి. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథార్టీగా మార్చేశారు. ‘హ్యాపీ నెస్ట్’ పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రాజధాని నిర్మాణంలో ఆయన చేసింది ఏముంది?. ఈ నాలుగేళ్ల కాలంలో టీవీలలో ప్రచారం తప్ప, ఏమైనా అభివృద్ధి చేశారా? ఇప్పటికైనా చంద్రబాబు తన జిమ్మిక్స్ మానుకోవాలి.

దేశంలో పెద్దనోట్లు రద్దు చేసి రెండేళ్లు అయినా ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ‘ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. బ్లాక్ మనీ, తీవ్రవాదం అరికట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన మోదీ ...ఆ ఫలితాలు సాధించారా?. నోట్ల రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదం తగ్గిందని చెబుతున్నారు. నోట్ల రద్దు అయిన తర్వాత తీవ్రవాదం ఇంకా పెరిగింది. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి.’ అని అని విమర్శించారు. 
 

English Title
CPI Rarakrishna demands probe by sitting judge enquiry on visakha land scam
Related News