‘కొత్తగూడెం, దేవరకొండ’ కోసం పట్టు

Updated By ManamFri, 11/09/2018 - 11:56
CPI State Committee Meeting Begin over Alliance Seats
CPI Meeting begin

హైదరాబాద్ : మహాకూటమిలో సీపీఐకి మూడు స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యవర్గం అత్యవసరంగా సమావేశం అయింది. సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ఎంపికపై జిల్లా కమిటీలతో నేతలు చర్చించనున్నారు. కాగా తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్దుం భవన్‌లో భేటీ జరుగుతోంది. 

మహా కూటమి సీట్ల సర్దుబాట్లు, కాంగ్రెస్ ఇస్తానన్న మూడు సీట్లతో పాటు మరో రెండు ఎమ్మెల్సీలు ఇస్తామన్న ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. అయితే సీపీఐ కొత్తగూడెం, దేవరకొండ అసెంబ్లీ స్థానాల కోసం పట్టుబపడుతోంది. ఇప్పటికే హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా స్థానాలను సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక స్థానం కావాలని సీపీఐ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్గవర్గ అత్యవసర భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

English Title
CPI State Committee Meeting Begin over Alliance Seats
Related News