వైఎస్సార్ సీపీ కుట్ర అని చెప్పడం దారుణం..

Updated By ManamFri, 08/31/2018 - 14:18
cpm madhu takes on chandrababu naidu government
  • ప్రతిపక్షాల పీకలు నొక్కే యత్నం

  • ప్లకార్డ్‌లు చూపిస్తే నాన్ బెయిలబుల్ కేసులా?

cpm madhu

విజయవాడ : తెలుగుదేశం ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డడారు. ప్రజల నుంచి టీడీపీ దూరం అవుతోందని, ప్రభుత్వ వైఫల్యాలు మరింత ప్రస్ఫుటం అవుతున్నాయన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.... ‘ప్రతిపక్షాల పీకలు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు సభలో మైనార్టీ యువకులు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని ప్రశ్నించారు. ప్లకార్డ్‌లు చూపినందుకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. అంతకు ముందు కూడా గుంటూరులో ముస్లిం యువకులను రెండు నెలల పాటు వేధించారు. 

గుంటూరు ఎస్పీ జరిగిన దానిని వైఎస్సార్ సీపీ కుట్ర అని చెప్పడం దారుణం. ఎస్పీ ఒక అధికారిగా వుండాలి కానీ రాజకీయ నాయకుడిగా కాదు. ముస్లిం యువకులపై ఫిర్యాదులో లేని అంశాలను ఎలా ఎఫ్ఐఆర్‌లో పెడతారు. పోలీసులు, కలెక్టర్ రాజకీయ నాయకుల మాదిరిగా వ్యవహరించకూడదు. జిల్లా ఎస్పీ చేసిన రాజకీయ వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించు కోవాలి. అధికారులు ఇలా బరితెగించి వ్యవహరించడం సరికాదు. 

ప్రశ్నించే వారందరనీ అరెస్ట్ చేయడం... తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ వైఖరికి నిరసనగా అన్ని విపక్షాలు కలిసి రాష్ట్ర బంద్‌కు సైతం పిలుపునిస్తాం. గుంటూరులో ముస్లిం మైనారిటీ యువకులు ప్లకార్డులు చూపితే... వారిని రౌడీలుగా చూపుతారా?. ప్రతి విషయంలోనూ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. దానిని ఎవరైనా ఎత్తిచూపితే.. పోలీసులను ప్రయోగిస్తున్నారు. వామపక్షాలే కాదు... దళితులు.. ముస్లింలు.. రైతులు... చివరికి సామాన్యులపై కూడా కేసులు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. 

జనసేనతో వామపక్షాలు ప్రజాసమస్యలపై కలిసి పనిచేస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే పొత్తుల విషయం ఆలోచిస్తాం. విసరం నేత వరవరరావుతో పాటు పలువురు మేధావుల అరెస్ట్ లను ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామిక హక్కులపై నరేంద్ర మోదీ చేస్తున్న దాడి’ అని వ్యాఖ్యానించారు. 

English Title
CPM Madhu Attacks telugudesam Government
Related News