సీపీఎస్.. పోవాలి!

Updated By ManamMon, 04/16/2018 - 03:24
cps
  • జీవో 28ను రద్దు చేయాలి.. రోడ్డున పడుతున్న ఉద్యోగుల కుటుంబాలు

  • సామాజిక భద్రత ఉండాలన్నదే మా ఆకాంక్ష.. ‘ఉద్యోగుల’ జనజాతర సభలో నేతలు

cpsహైదరాబాద్: ‘నేల ఈనిందా.. ఆకాశం ఊడి పడిందా’ అన్నట్టు సీపీఎస్ జనజాతర సభ ఉందని, ఇది ఆరంభం మాత్రమేనని టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థతప్రజ్ఞ అన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం( సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన సీపీఎస్ ఉద్యోగుల జనజాతర సభనుద్దేశించి ఆయన మాట్లాడారు. సీపీఎస్‌ను అంగీకరిస్తూ ఆగస్టు 23, 2014న ఇచ్చిన జీవో నంబర్ 28ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 1.32 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. 294 మంది సీపీఎస్ ఉద్యోగులు అమరులయ్యారని, వెయ్యి మందికి పైగా విశ్రాంత ఉద్యోగులు మరణించారన్నారు. వారి కుటుంబాలకు ఏలాంటి అండ లేక రోడ్డున పడ్డాయని చెప్పారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారమే.. సామాజిక సంక్షేమ భద్రత ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. సత్వరమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకుని పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆగస్టు 23 తర్వాత కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు. ప్రస్తుత సీపీఎస్‌ను రద్దు చేసిన పించన్ స్కీంను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుకు గత ఏడాది ఫిబ్రవరి 26న శంఖారవం సభను నిర్వహించామని, అదే ఏడాది సెప్టెంబరు 1న రాష్ట్రంలోని ఉద్యోగులందరూ సామూహిక సెలవు పెట్టి నిరసన వ్యక్తం చేశామన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని జనవరి 7న సీఎం కేసీఆర్ ద ష్టికి తీసుకెళ్లాలని గజ్వేల్‌లో అయుత ధర్మదీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలిపారు.  ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనజాతరను సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులతో నిర్వహించామని పేర్కొన్నారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ హాజరయ్యారు. సభకు అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తమ కుటుంబసభ్యులతో హాజరయ్యారు.

Tags
English Title
cps
Related News