చరిత్ర సృష్టించడం గొప్ప అనుభూతి : కోహ్లీ

Updated By ManamThu, 02/15/2018 - 01:05
Creating history feels great: Kohli

పోర్ట్ ఎలిజబెత్: సౌతాఫ్రికాపై ఐదో వన్డేలో గెలిచి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న జట్టు సహచరులను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. ఈ సిరీస్‌లో తమ జట్టు ‘సంపూర్ణ ప్రతిభ’ కనబరించిందన్నాడు. ‘చరిత్ర సృష్టించినందుకు గొప్ప అనుభూతి కలిగింది. సహచరులు నిజంగా ప్రణాళికలకు కట్టుబడి ఉన్నారు. బ్యాట్‌తో, బంతితో, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రతిబకనబరిచారు’ అని కోహ్లీ అన్నాడు. గతంలో రోహిత్ శర్మ మూడుసార్లు సౌతాఫ్రికా పర్యటనకు వచ్చాడు. కానీ తొలిసారి సెంచరీ (115) చేశాడు. దీంతో టీమిండియా ఐదో వన్డేలో 73 పరుగులతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 13 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సౌతాఫ్రికా అవకాశాలు క్షీణించాయి. జేపీ డుమిని, ఏబీ డివిలియర్స్ వంటి కీలక వికెట్లను హార్దిక్ పాండ్యా పడగొట్టి సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బ తీశాడు. అయితే తమ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేదని సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ అన్నాడు. ఇదిలావుంటే ఈ సిరీస్‌ను 5-1తో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ  అన్నాడు.
 

English Title
Creating history feels great: Kohli
Related News