పిల్లి బిత్తిరి వేషాలకు భయపడను: కత్తి

Updated By ManamSun, 04/15/2018 - 16:54
Kathi Mahesh vs sunitha

Kathi Mahesh about sunitha accusations of defamation

సినీ క్రిటిక్ కత్తి మహేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొద్దిరోజులుగా టాలీవుడ్‌‌ ‘కాస్టింగ్ కౌచ్’ వ్యవహారంపై తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో జూనియర్ ఆర్టిస్ట్ సునిత.. కత్తి మహేశ్ కూడా తనను ఇబ్బంది పెట్టాడని బండారం బయటపెట్టింది. దీంతో కత్తి ఏవేవో.. ఊహించుకుని ఫేస్‌‌బుక్ లైవ్‌‌లో ఏదేదో మాట్లాడేశారు. ఇష్టమొచ్చినట్లు కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారు... వాటన్నింటిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలా కాని పక్షంలో గుణపాఠం తప్పదని చెప్పుకొచ్చారు. 

కత్తి వ్యాఖ్యలివీ..
"
నాపై కుట్రలు చేసే వారికి నేను చెబుతున్నది ఒక్కటే. చట్టాలు మీ కంటే నాకు బాగా తెలుసు. పిల్లి బిత్తిరి వేషాలకు నేను భయపడను. అది మెగాస్టార్‌ అయినా.. పవర్‌స్టార్‌ అయినా... మెగాపవర్‌ స్టార్‌ అయినా భయపడాల్సిన అవసరం నాకు లేదు. నా విషయంలో దిగజారి వ్యవహరిస్తే మీ పెద్దరికాలే పోతాయి. నా వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యవహరించారు. ఇక ఓపిక పట్టాల్సిన అవసరం నాకు లేదు. నాపై ట్రోలింగ్‌, విమర్శలు చేస్తున్న వారు మాత్రం కాస్త ఓపిక పట్టండి. రెండు మూడు రోజుల్లో అందరి బతుకులు బయటపెడతాను" అని కత్తి మహేష్‌ చెప్పుకొచ్చారు.

అయితే.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాదు అందరి బతుకులు బయటపెడతానని చెప్పడంతో అసలు కత్తి ఏం చెప్పదలుచుకున్నారు?. కత్తి దగ్గరున్న ఆధారాలేంటి? అసలు ఆయన ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

 

Accusations and defamations.

Posted by Mahesh Kathi on Saturday, April 14, 2018

 

English Title
Critic Kathi Mahesh about Jr artist Sunitha Accusations of Defamation
Related News