జనసేనపై ‘కత్తి’ సంచలన ట్వీట్స్

Updated By ManamTue, 03/13/2018 - 14:50
Critic Kathi Mahesh Sensational Comments

Critic Kathi Mahesh Sensational Comments On Janasena Party And Pawan

హైదరాబాద్: జనసేనపై సినీ క్రిటిక్ కత్తి మహేశ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా జనసేన, పవనిజంపై కత్తి విరుచుకుపడ్డారు. జనసేన పార్టీ ఆరంభంలోని భానిసత్వం ఉందంటూ కత్తి దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పార్టీ ఆఫీస్ నిర్మాణపు పునాదిలోనే అవినీతి నెలకొందని కత్తి చెప్పుకొచ్చారు. ఓ వైపు పవన్ కల్యాణ్‌‌ను విమర్శిస్తూనే చివరి ట్వీట్‌‌లో ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు కత్తి.

కత్తి ట్వీట్స్..
- "జనసేన పార్టీ ఆరంభంలోనే బానిసత్వం ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ పంథాలోనే జీహుజురి ఉంది. పార్టీ ఆఫీస్ నిర్మాణపు పునాదిలోనే అవినీతి ఉంది. ఇది మార్పు కోసం వస్తున్న రాజకీయం కాదు. ఏమార్చడానికి కొనసాగుతున్న పవనిజం"

-" పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ల్యాండ్ డీల్ నాకు ఇస్తే, పవన్ కళ్యాణ్ పక్కన ప్లాట్ తీసుకుని అమరావతి షిఫ్ట్ అవ్వడానికి నేను రెడీ!"

-"మాదాసు గంగాధరం మరియు రాఘవయ్య లాంటి యువనాయకత్వం జనసేన ఆవిర్భావసభ ఏర్పాట్లు చూసుకోవడం ముదావహం. పవన్ కళ్యాణ్ కి అభినందనలు" అని కత్తి ట్వీటారు.

 

 

 

 

English Title
Critic Kathi Mahesh Sensational Comments On Janasena
Related News