ప్రస్తుత భవనాన్ని ఏపీకి ఇస్తం 

Updated By ManamSat, 09/01/2018 - 06:18
high
  • హైకోర్టు విభజనపై సుప్రీంకు తెలిపిన తెలంగాణ

  • వెంటనే విభజన చేయాలంటూ విన్నపం

  • వాదనలకు ఏపీ న్యాయవాది గైర్హాజరు

  • కేసు విచారణ రెండు వారాలకు వాయిదా

highన్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న హై కోర్టు భవనాన్ని ఏపీకి ఇచ్చి, బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టు కు నివేదించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన హైకోర్టు విభజన పై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు లో జరిగిన విచారణలో ఇప్పుడున్న భవనం లో కానీ, వేరే భవనంలో కానీ తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని తన వాదనలు వినిపించారు. ప్రస్తుత భవనంలో 24 హాళ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఏపీ సర్కారు ఈ హాళ్లను వాడుకోవచ్చని... అవసరమైతే హైకోర్టు భవనం మొత్తాన్ని ఖాళీ చేసి, ఏపీకి అప్పగిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎందుకు హైకోర్టు లు ఏర్పాటు చేయకూడదంటూ కేంద్ర ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. కేంద్రం తరపున అటార్నీ జనరల్ వేణుగోపాల్ తెలంగాణ, ఏపీలకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని తన వాదనలు వినిపించారు. కాగా, 2015 మే 1న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయలని  విన్నవించారు. ముకుల్ రోహత్గి కేంద్రం వాదనలతో ఏకీభవిస్తున్నామని, రాష్ట్ర విభజన తర్వాత చట్ట సభలు, అధికారుల విభజన జరిగింది కానీ న్యాయ వ్యవస్థ విభజన జరగలేదని వివరించారు. వాదనలు విన్న అనంతరం ఉమ్మడి హై కోర్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను రెండు వారాల లోగా తెలియజేయాలని జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం.

Tags
English Title
The current building is for the AP
Related News