ట్రైబ్యునల్‌ను ఆశ్రయించిన దైచి శాంక్యో

Updated By ManamWed, 09/19/2018 - 00:23
sankyo

sankyoన్యూఢిల్లీ: ఆర్‌హెచ్‌సి హోల్డింగ్‌కు వ్యతిరేకంగా హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ చేపట్టిన ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగులను నిలిపివేయాలని కోరుతూ జపాన్ ఔషధ తయారీ దిగ్గజం దైచి శాంక్యో ఇటీవల జాతీయ కంపెనీలా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. దీనిపై వారం రోజుల లోగా జవాబు దాఖలు చేయవలసిందిగా ఆర్‌హెచ్‌సి హోల్డింగ్‌ను, దానికి అప్పు ఇచ్చిన హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్‌ను రెండింటినీ ట్రైబ్యునల్‌కు చెందిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. ట్రైబ్యునల్ ఈ అంశంపై తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది. హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ దాఖలు చేసిన దివాలా అభ్యర్థనలో తననూ ఒక వాదిగా చేర్చుకోవాలని కోరుతూ దైచి శాంక్యో ఇంటర్‌వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేసింది. ఆర్‌హెచ్‌సి హోల్డింగ్ నుంచి నగదు రికవరు చేసుకునేందుకు తమ కు డిక్రీ ఉందని దైచి పేర్కొంది. ఆర్ హెచ్‌సి హోల్డింగ్స్ ఆస్తులు అమ్మడానికి లేకుండా యథాతథ స్థితిని కొన సాగించాలని ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దైచి హోల్డింగ్‌కు అనుకూలంగా సింగపూర్ లోని ట్రైబ్యునల్ కూడా ఆదేశాలు జారీ చేసింది. షేర్ల అమ్మకానికి సంబంధించిన అంశంపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ శాఖ, న్యాయ శాఖల నుంచి దర్యాప్తును ఎదుర్కొంటున్న సమాచా రాన్ని  సింగ్ సోదరులు (మల్‌విందర్ సింగ్, శివిందర్ సింగ్) కప్పిపెట్టారని ట్రైబ్యునల్ పేర్కొంది. దైచికి అనుకూలంగా జారీ అయిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రల్ అవార్డు సరైనదేనని హైకోర్టు జనవరి 31న పేర్కొంది. ఆ విధంగా సింగ్ సోదరులకు వ్యతిరేకంగా 2016లో వెలువడిన ట్రైబ్యునల్ అవార్డు అమ లుకు మార్గం సుగమం చేసింది.  రాన్‌బాక్సీలో ఉన్న రూ. 9,576.1 కోట్ల విలు వ చేసే షేర్లను సింగ్ సోదరులు దైచికి విక్రయించారు. ఆ తర్వాత, దైచి నుంచి రాన్‌బాక్సీని సన్ ఫార్మాస్యూటికల్స్ స్వాధీనం చేసుకుంది. అయితే, ఐదుగురు మైనర్లకు వ్యతిరేకంగా ఈ అవార్డును అమలు చేయలేమని కోర్టు పేర్కొంది. ఆ ఐదుగురు మైనర్లు కూడా రాన్‌బాక్సీలో షేర్‌హోల్డర్లుగా ఉన్నారు. వారిని దోషులుగా ప్రకటించలేమని పేర్కొంది. మధ్యవర్తిత్వ అవార్డు రూ. 3,500 కోట్లను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవలసిందని సింగ్ సోదరులను ఆదేశించాలని కోరుతూ దైచి హైకోర్టును ఆశ్రయించింది. వారి ఆస్తులను జప్తు చేయాలని కోరింది. 

English Title
Daichi Sankyo who approached the Tribunal
Related News