దళిత హత్యలు దేశద్రోహమే!

Updated By ManamSun, 09/23/2018 - 06:02
artical about daliths

imageరాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ప్రణయ్ హత్య మరవక ముందే హైదరాబాద్‌లో బోరబండకు చెం దిన మాధవి, సందీప్‌లపై కుల ఉన్మాదంతో హత్యాయత్నం జరి గింది. ఈ హత్యాయత్నంలో అమృత వర్శిని తండ్రి వెశ్య వ ర్ణం (కులం)కు చెందిన వ్యక్తి మారుతిరావు అయితే, బోర బండలో మాదవి తండ్రి మనోహరచారి బిసి విశ్వకర్మ కులా నికి చెందినవ్యక్తి. ఇక్కడ బాధితులు మాత్రం దళితులే. పై రెండు సంఘటనలలో వారి కూతుర్లు తమ మనసుకు, అభి రుచులకు నచ్చిన వ్యక్తులుగా మాత్రమే చూశారు కానీ వారు అంటరాని దళితకులానికి చెందినవారు అని చూడలేదు. ప్రే మ -ఇష్టం అనేది ఎలా ఎప్పుడు ఎందుకు పుడుతుందో వేరే సందర్భాలలో మాట్లాడుకోవచ్చు. అయితే ప్రేమించి పెండ్లి చేసుకున్నందుకు కులప్రతిష్టలు తగ్గుతున్నవని కుల ఉన్మా దంతో, హత్యాయత్నం చేయడం చూస్తే రోజురోజుకు కుల తత్వం పెట్రేగిపోయి మానవీయత తగ్గుతుందని స్ఫష్టమైం ది.

2017లో పెద్దపల్లి జిల్లా మంథనిలో మాదిగ మధుకర్ మున్నూరుకాపు కులానికి చెందిన శిరిషాను ప్రేమించినంimage దుకు జీర్ణించుకోలేని శిరిషా కుటుంబం మధుకర్‌ను చంపి భూమిలో పాతిపెట్టారు. ఈ హత్య విషయం 23 రోజులకు బైటపడింది. మే 29, 2017న యాదాద్రి భువనగిరి జిల్లాలో బిసి సామాజిక వర్గంలోని చాకలి కులానికి చెందిన నరేష్ అనే యువకుడు స్వాతి అనే రెడ్డి కుల యువతిని ప్రేమించి నందుకు స్వాతి కుటుంబసభ్యులు హత్యచేసి కాల్చి బూడిద చేశారు. నరేష్ హత్యను తట్టుకోలేని స్వాతి ఆత్మహత్య చేసు కున్నది. నాగర్‌కర్నూల్‌లో తెలగ కుల యువతిని మాదిగ యువకుడు ప్రేమించినందుకు ఎరుకల యువతిని హత్యచే శారు. 2018 జూన్ నెలలో సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంటలో ని కందికట్కూర్‌లో దళితులైన మాదిగ ఎల్లయ్యను తన కొ డుకు శేఖర్‌లను వారు సాగుచేసుకుంటున్న భూమిలో (ఆ భూమి దేవయ్యదా ఎల్లయ్యదా అనేదికాదు) బిసి సామాజిక వర్గంలోని ముదిరాజ్ కులానికి చెందిన మామిండ్ల దేవయ్య తనకుమారులు, భార్యతో కలిస గొడ్డళ్లతో నరికి చంపారు. ఇ వే కాదు రాష్ట్రంలో, దేశంలో అనేక సంఘటనలు రోజు రోజు కు జరుగుతూనే ఉన్నాయి. కింది కులాలంటే, దళితులంటే మరీ లెక్కలేదు. ఈ మొత్తం దాడుల, అత్యాచారాలలో స్త్రీల జీవితాలు అంటేనే లెక్కలేదు. కింది కులాలపై దాడులు చే యడంలో దళితులపై ఆధిపత్య కులాల స్త్రీలు క్రూరంగా అ గ్రకుల హత్యోన్మాదంలో ప్రధాన భాగస్వామ్యం అవుతున్నా రు. లక్షింపేటలో, కారంచేడులో, కందికట్కూరులో స్త్రీలే కారంపొడి చల్లి భర్తలకు సహకరించిన సందర్భాలున్నాయి. ప్రణయ్ హత్యలో అమృతవర్షిణి తల్లి గిరిజ అమృతరావుకు తెలిసే మాట్లాడుతున్నప్పటికీ పైకిమాత్రం తెలియనట్లు నటిస్తూ అమృతవర్షిణి గర్భవతని మంచీచెడులు తెలుసుకునే నెపంతో ఇచ్చిన సమాచారంలో భాగమే ప్రణయ్‌కుమార్ హత్య. పై విషయాలను బట్టి స్త్రీలు తమ మాతృత్వాన్ని, మానవత్వాన్ని మరిచినక్రమం నేడు మనం చూస్త్తున్నాం. అయితే స్త్రీలను పురుషులు కులతత్వంతో, డబ్బు ఉన్న తనంతో హత్యలు, అత్యాచారాలు చేస్తుండడం రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అంతర్గతంగా ఏ కులానికా కులం త మ కుల పరిధిని దాటకుండా అస్పృశ్యతను పాటింపచేసే విపరీతతనాన్ని ఈ ఆధిపత్య స్వభావం గల పెత్తందారులు పెంచి పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క దళితులు ప్రేమించి పెండ్లిచేసుకోవడమే నేరమనే కాదు, దళితేతర బిసి కులా లకు చెందిన యువతీయువకులు ప్రేమించి పెండ్లిచేసుకున్న జీర్ణించుకోదు. ఒక్క దళిత బిసిలే కాదు ఎరుకల యువతిని మాదిగ యువకుడు ప్రేమించి పెండ్లిచేసుకున్న అంగీకరించ దు. అందుకు కారణం, తన కులంకాని మరే ఇతర కులాలు తన కులంలో జోక్యం చేసుకోవ్వకపోవడమే దాని లక్షణం, అదే కులవ్యవస్థ లక్షణం.

ఈ కులపరమైన అనాగరిక చర్యలు మతం మలుపు రంగుతో బిసిలు, ఎస్సీలు, గిరిజన తెగలలోని సంప్రదా యాల, మూఢవిశ్వసాల కేంద్రంగా బైటకొస్తున్నవి. పైగా వీటిని ఆత్మగౌరవ కేకలుగా పేర్కొంటున్నారు. ఆయా కులా లు తమ కులపరిధిలో సమీకరణలు జరుపుతున్న నేపథ్యం లో కులాంతర పెండ్లిలను జరగకుండా నియంత్రిస్త్తున్నది. ఇదే బహుళంగా కిందికులాలపై భౌతికదాడులకు, పరువుపేర ఊచకోత కోయాలని ప్రేరేపిస్తున్నది. మతోన్మాదులు- రాజ్యం ఈ రెండు మిళితైమె కులకట్టుబాట్లు విధ్వంసం కాకుండా సింహద్వారాల దగ్గర వేచివున్నాయి. ఒక్కమాటలో హిందు మతానికి కులవ్యవస్థ ముఖద్వారం అయితే ఆ కుల వ్యవస్థకు స్త్రీయే ముఖద్వారం. దీని పరిరక్షణ మతాదుల రాజ్యానిది.

ఈ దేశంలో నాగరికతను అభివృద్ధి పరిచేందుకు ఒకవైపున దళితుల, బిసిలు, మైనార్టీలు, ఆదివాసి గిరిజనులు, ఆడవాళ్ళు, రైతులు, కూలీలు వీరోచిత త్యాగాలు చేస్తున్నా రు. ఈ క్రమంలో పాలకులు ఆదివాసి గిరిజనులను అడవిని, సంపధను ఒదిలి పోవాలంటున్నారు. దళితులు దోపిడి కు లాలకు బానిసలుగా ఉంటామని కచ్చితమైన హామిని ఇవ్వా లంటున్నారు. మైనార్టీ మతస్తులు హిందుమతంలోకి రావా లంటున్నారు. కాశ్మీర్ ప్రజలు సర్వస్వతంత్రులు కాదని ఇండి యాలో అంతర్భాగం కావాలంటున్నారు. ఈ కొనసాగిం పు లో భాగమే దేశవ్యాప్తంగా కింది కులాల పిల్లలు కులాంతర వివాహాలు, వివాహానంతర విందులు - వినోదాలు చేసు కుంటే, చివరకు మోటార్ సైకిళ్ళు - గుర్రాలు ఎక్కిన, రచ్చ బండపై కాలుపెట్టిన, భూములు కావాలన్న ఆధిపత్య కుల ఉన్మాదంతో కులచట్రం దాట కుండా కులకట్టుబాట్ల పేర హత్యలు చేస్తున్నారు. కొద్దిమందిని మూకహత్యల పేర కూడా హత్యలు చేసిన సంఘటనలున్నాయి. ఈ అన్యవర్గ కుల ధోరణిని నిలువరించడంలో పాలకవర్గాలు, సామాజిక ప్రజాస్వామికవాదులు విఫలమయ్యారు. ఇంత జరుగుతు న్నా కులవ్యవస్థపై విశ్లేషణలు మాత్రమే చేస్తున్నారు. కానీ నేడు ఇప్పుడు కావల్సింది కులవ్యవస్థ నిర్మూలనకు తక్షణ కార్యాక్రమాలు. 

ఒకవైపు మత - కుల మౌఢ్యంతో ఈ దేశంలోని దళి తులు పరదేశీయులుగా పరిగణించబడుతున్నారు. దళితు ల ను హత్యచేస్తూనే (ఒక్క దళితులే కాదు బిసిలు, ఆదివాసీల గిరిజనులు) దళితులు హిందుమతంలో అంతర్భాగమని చెప్పడం పెద్దకుట్రే. అలాంటప్పుడు ఈ దళితులను (హిందు మతస్తులను హిందువులు) ఆధిపత్యకులాలు ఎలా హతమా రుస్తారు? హత్యకు గురయ్యే వారు హిందువులు కారని ఆయా సంఘటనలు జరిగిన విధానంలో చూస్తే అర్ధమవు తుంది. అహంకారపూరిత ఆధిపత్యంలో మెజార్టీ హిందు మతస్తులుగా వున్న వారు అసలే మనుగడ లేని ఈ శోషితు లను హత్యచేస్తే నిర్లక్ష్యంగా వ్యవహారిస్తారని తేలిపోతున్నవి, ఇది ముమ్మాటికి రాజరికవాదుల ఆలోచన, దృక్పథమే అవుతుంది. 

ఈ అణచబడ్డ కిందికులాలపై దాడులు, హత్యలు చేసిన ఆధిపత్యకుల పెత్తందారుల, ఉన్నత వర్గాలపై ఎస్సి ఎస్టి అట్రాసిటి యాక్టు పేర కేసులు నమోదు కాబడిన వాటిని విచారణపేర (కోర్టు విచారణ పేరుతో) ఏళ్ల తరబడి శిక్షించకుండా వాయిదా వేస్తున్నారు. వేర్వేరు కులాల్లోగాని, మతాంతర ప్రేమ పెండ్ల్లిళ్లను వ్యతిరేకించే వారితో పాటు, దళితుల అభివృద్ధిని వోర్వలేని ఆధిపత్య కులోన్మాదులు దాడులు, హత్యలు చేస్తున్న వారు ఎస్సీలు, బిసిలు, ఆధి పత్య కులాలెవరైన సరే వారిని కఠినంగా శిక్షించాలి. అసలు ఈ దేశంలో అక్రమంగా చొరబడి దేశంలో అమాయకులను హతమారిస్తే దేశద్రోహాం అయినట్లే ఈ దేశంలోని కింది కులాల ప్రజలను ఇదేదేశ ఆధిపత్య కుల ఉన్నతులు హత మార్చడం కూడా దేశ ద్రోహంగా పరిగణించాలి. అంతటితో ఆగరాదు, ఆ నిందితుల ఆస్తులను జప్తుచేసి బాధిత కుటుం బాలకు అప్పగిస్తే తప్పేంటి? ఇలా చేయడంతో వారిని సామాజికంగా, ఆర్ధికంగా దెబ్బదీయవచ్చు. భావాజాల పరంగా కులం చట్రం వెలుపల పెళిళ్ల్లను ప్రేరేపించాల్సి ఉంటుంది.
  
ఈ కుల పాలనను రద్దుచేయడం అంటే శోషిత ప్రజలు అస్థిత్వంలోకి రావడమే అవుతుంది. ఆధిపత్యకులాల, మతో న్మాదం పేర శోషిత జనసమూహాంపై హత్యోన్మాదం లేకుండా ఉండాలంటే ఈ సముహాలలోని కులవివక్ష, అంట రానితనాన్ని, కులపీడన, అనువంశిక వృత్తితో కొనసాగుతు న్న శ్రమదోపిడిని వ్యతిరేకించే సంఘటిత శక్తిని ప్రేరేపిం చాల్సి ఉంటుంది. వీరు కులతత్వం నుంచి విముక్తులు కావా లంటే పైన పేర్కొన్న కార్యక్రమాలతో పాటు వీరి మధ్యలో స్నేహాఫూర్వకమైన ఏకీభావం అవసరం. అందుకోసం సరళ మైన నైతిక నియమాలు, సూత్రాలుగా ఉండాలి. ఇందు కోసం కింది కులాలల్లో శత్రుపూరిత వైరుధ్యాలను తొలగించుకునేందుకు శోషితులను సిద్ధంచేయడం మంచిది. ఈ విషయాల పట్ల భౌతిక శక్తిగల మేధావులు పౌర సమాజాన్ని స్వయం రక్షణగా భావించి అందుకు ప్రజలను సిద్ధపరచాలి.

- పాపని నాగరాజు
 ప్రధాన కార్యదర్శి, సామాజిక తెలంగాణ మహాసభ
9948872190

English Title
Dalit killings are national fruad!
Related News