ఉత్తమ్‌ను కలవలేదు, కావాలనే దుష్ప్రచారం..

Updated By ManamMon, 09/10/2018 - 12:58
danam nagendar condemns back to congress party
danam nagendar

హైదరాబాద్ : తాను కాంగ్రెస్ పార్టీలో  చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ ఖండించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తాను కలవలేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఏ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని దానం పేర్కొన్నారు.  కొంతమంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

కాగా ఖైరతాబాద్ టికెట్‌ను దానం ఆశిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ అధినేత ఆ నియోజకవర్గ అభ్యర్థి ప్రకటనను పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఖైరతాబాద్ టికెట్‌ రేసులో దానం నాగేందర్‌తో పాటు దివంగత పీజేఆర్ కుమార్తె, కార్పొరేటర్ విజయ రెడ్డి కూడా ఉన్నారు. దీంతో టికెట్ కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే దానం నాగేందర్ తిరిగి సొంతగూటికి చేరుకుంటే, ఆయనకే ఖైరతాబాద్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి.

English Title
danam nagendar condemns his mets Uttam kumar reddy
Related News