'ఉత్తమ్‌ కుమార్‌వి ఉత్త మాటలు'

Updated By ManamMon, 09/03/2018 - 19:43
Danam Nagender, Uttam Kumar reddy, TRS party, Pragathi Nivedhana Sabha
  • టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ 

Danam Nagender, Uttam Kumar reddy, TRS party, Pragathi Nivedhana Sabhaహైదరాబాద్: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభపై టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డివి ఉత్త మాటలని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ విమర్శించారు. ప్రగతి నివేదన సభ విజయవంతం అయిందని కొందరు కాకిగోల చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం దానం మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు  తెలిపారు. సభ అనుకున్న ప్రకారం మొదలు అయ్యిందని, ట్రాఫిక్ జామ్ వల్ల వేల మంది సభకు రాలేక పోయారని చెప్పారు. హామీలతో ఉత్తమ్ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ భచావో కాదు... గాంధీ భవన్‌లో ‘ఉత్తమ్ కో హఠావ్... కాంగ్రెస్ కో బచావ్’ అని అంటున్నారని ఎద్దేవా చేశారు.  టీఆర్ఎస్ సభకు వరుణుడు సహకరించిందని అన్నారు.

కాంగ్రెస్ నేతలు కాకి గోల చేస్తున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలపై కాంగ్రె‌స్‌లో తలో మాట మాట్లాడుతున్నారని, లక్షల మంది జనం ఆశీర్వాదం కేసీఆర్‌కు ఉన్నదని దానం చెప్పారు. బడుగు బలహీన వర్గాల అండ టీఆర్ఎస్‌కు ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ‌లో బీజేపీకి ఒక్క సీటు రాదని ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ చెప్పారు. ప్రగతి నివేదన సభ కావునా.. కేసీఆర్ రాజకీయ విమర్శలు చేయలేదని, రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రతి పక్షాలను కడిగి పారేస్తారని దానం తెలిపారు. సొంత పార్టీ నేతలు రెండు లక్షల రుణమాఫీ సాధ్యం కాదని ఉత్తమ్‌కు చెప్పారని అమిత్ షాతో ఉత్తమ్ ఎందుకు రహస్యంగా  సమావేశం అయ్యారో చెప్పాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. 

English Title
Danam Nagender slams Uttam kumar reddy  
Related News