ముంబై విలవిల.. ఢిల్లీ గెలుపు.. 

Updated By ManamSun, 05/20/2018 - 20:20
IPL 2018, Delhi daredevils, Mumbai Indians, Rishabh Pant
  • 11 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డేవిల్స్ గెలుపు.. ఢిల్లీ స్పిన్నర్ల ధాటికి ముంబై విలవిల.. 

IPL 2018, Delhi daredevils, Mumbai Indians, Rishabh Pant న్యూఢిల్లీ: ఐపీఎల్‌-11సీజన్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్ధేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటై పరాజయం పాలైంది. ఢిల్లీ బౌలర్ల స్పిన్నింగ్ ధాటికి ముంబై బ్యాట్స్‌మన్ చేతులేత్తేశారు.  

ఈ సీజన్‌లో  ఢిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ కథ ముగిసింది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ వరుసగా చేతులెత్తేశారు. లూయిస్ 7(48) మినహా ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేక చేతులేత్తేశారు. కట్టింగ్ (37), హర్దీక్ పాండ్యా (27), కెప్టెన్ రోహిత్ శర్మ (11) పరుగులు చేయగా మిగిలిన ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమై ఒకరితరువాత మరొకరు పెవిలియన్ బాటపట్టారు. ఢిల్లీ బౌలర్లలో సందీప్‌, అమిత్ మిశ్రా, హర్షల్ పటేల్ తలో మూడు వికెట్లు తీసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌ రేసులో ముంబై ఇండియన్స్‌ లక్ష్యం నెరవేరలేదు. ఈ మ్యాచ్‌లో ఓటమితో ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

రెచ్చిపోయిన రిషబ్ పంత్.. హాఫ్ సెంచరీ
అంతకుముందు బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది. దీంతో ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్‌కు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ ఓపెనర్లలో పృథ్వీ షా (12) రనౌట్ కాగా, మ్యాక్స్‌వెల్ (22) బుమ్రా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం (6) పరుగులకే మార్కండే బౌలింగ్‌లో హర్దీక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తరువాత వచ్చిన రిషబ్ పంత్, విజయ్ శంకర్ దూకుడుగా ఆడుతూ స్కోరులో వేగాన్ని పెంచారు. అందివచ్చిన బంతులను ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. రిషబ్ పంత్ (44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్) విజృంభించి 64 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఒక దశలో హర్దిక్ పాండ్య బౌలింగ్‌ రూపంలో పంత్ దూకుడుకు బ్రేక్ పడటంతో పోలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి క్రీజునుంచి నిష్ర్కమించాడు. విజయ్ శంకర్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్) 43 పరుగులు, అభిషేక్ శర్మ (15) పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. ముంబై బౌలర్లలో హర్దీక్ పాండ్యా, బుమ్రా, మార్కండే తలో వికెట్ తీసుకున్నారు.

English Title
Daredevils won by 11 runs




Related News