ప్రపంచంలో తగ్గుతున్న దైవభావన

Updated By ManamFri, 11/09/2018 - 03:00
no god

imageమనదేశంలో ఉన్న హేతువాదులు, నిరీశ్వరవాదులు, మానవతావాదులు సంతోషించాల్సిన విషయం ఒకటుంది. ‘గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ రిలిజియసిటీ’ లండన్ ప్రకటన 2005 ప్రకారం.. దైవ భావన, దైవ భీతితో ఉన్నవారు మనదేశంలో 87 శాతం. మళ్ళీ అదే సర్వే 2013లో జరిపినప్పుడు వ చ్చిన ఫలితం 81 శాతం. అంటే సుమారు ఏడెనమిదేళ్ళలో ఆరుశాతం మంది మన దేశ ప్రజలు దైవ భావనలోంచి బయటపడి, ఆత్మవిశ్వాసంతో మానవతావాదులుగా మారారన్నమాట!

ఇప్పుడున్న పోప్, పీఠాధిపత్యాన్ని స్వీకరించిన తర్వాత తాజా సర్వే ప్రకారం వియత్నాంలో 23 శాతం, స్విర్జర్‌ల్యాండ్‌లో 21 శాతం, దక్షిణాఫ్రికాలో 19 శాతం, అర్జెంటినాలో 8 శాతం మత విశ్వాసకులు తగ్గిపోయారు. అంటే అక్కడ హేతువాదుల సంఖ్య పెరిగినట్టే కదా? అయితే ఇందులో ఎటూ తేల్చుకోలేక తటస్థంగా ఉండేవారు కూడా కొంతమంది ఉండొచ్చు. ఏమైనా దైవభీతిలోంచి బయటపడాలన్న వారి నిర్ణయం ఆహ్వానించదగిందే! తీవ్రవాదానికి కేంద్ర బిందువుగా ఉన్న పాకిస్థాన్‌లో మాత్రం ఫలితం వేరుగా ఉంది. అది మనకు ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. పాకిస్థాన్‌లో మతోన్మాదులు గతం కన్నా ఇప్పుడు ఆరుశాతం పెరిగారు. మరో విషయవేుమంటే మన పక్కనే ఉన్న చైనాలో తన జనాభాలో సగం మంది ఇప్పుడు నాస్తికులని తాజా సమాచారం. అంటే మన దేశంలో నిరీశ్వరవాదులు 19 శాతైమెతే, చైనాలో 50 శాతమన్నమాట! ఈ లెక్కలిలా బేరీజు వేసుకోవడమెందుకంటే, మన వెనకబాటుతనాన్ని మనం అంచనా వేసుకుని వైజ్ఞానిక పథంలోకి అడుగువేయడానికి! శాస్త్ర సాంకేతిక రంగాలలో చైనా, అవెురికాతో పోటీ పడుతోంది. ప్రపంచ ఆధిపత్యం కోసం అర్రులు చాస్తోంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమంటే, దేవుణ్ణీ, మత విశ్వాసాల్నీ, మూఢనమ్మకాల్నీ పక్కన పెడితేనే పురోగమనం సాధ్యమని తెలుస్తోంది కదా? 

2011 నాటి యు.కె. జనాభా లెక్కల ప్రకారం అక్కడ క్రైస్తవులు 58.8 శాతం. అయితే, ఆ తరువాత స్థానం మతం లేని మానవతావాదులది! ఇక వరుసగా మిగిలిన స్థానాలన్నీ ఇతర మత విశ్వాసాలున్న వారివి. అలాగే అవెురికాలో జరిగిన సరికొత్త సర్వే ప్రకారం, మత విశ్వాసాల్ని పక్కన పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం అది 49 శాతం ఉంది. ‘ఎందుకు మత విశ్వాసాల్ని పక్కన పెడుతున్నారూ?’ అని అడిగినప్పుడు చాలా మంది చాలా రకాలుగా సమాధానాలిచ్చారు. అయితే అన్ని సమాధానాల సారాంశం ఒక్కటే! ఇంగిత జ్ఞానం వల్ల దేవుణ్ణి నమ్మడం లేదని కొందరంటే, లాజిక్ వల్ల నమ్మడం లేదని కొందరన్నా రు. ముఖ్యంగా సైన్సు అర్థం చేసుకోవడం వల్ల, దైవభావన పట్ల విశ్వాసం పూర్తిగా తగ్గిపోయింది అని ఎక్కువ మంది చెప్పారు. మహిమలు, అద్భుతాలు సైన్సు పరీక్షలకు నిలబడవు. అందువల్ల ఏ దేవుణ్ణి నమ్మినా ఏమీ ఫలితం ఉండదు. కేవలం మనల్ని మనం నమ్ముకుంటే చాలు - అన్న అభిప్రా యం అధిక సంఖ్యాకుల్లో కనిపిస్తోంది. కుటుంబంలో వారసత్వ కారణాల వల్ల బాల్యంలో మతవిశ్వాసాలు ఉంటే ఉం డొచ్చు కానీ, యవ్వన దశకు వచ్చేసరికి ఆలోచనలు మారిపోతున్నాయి. ప్రపంచాన్ని చూడడం, తోటి మనుషులతో వ్యవహరించడం, కళాశాలల్లో విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, ముఖ్యంగా జీవ పరిణామ సిద్ధాంతం పట్ల ఆకర్షితులు కావడం, దేవుడి పుట్టుకకు ఆధారాలు లేకపోవడం, దే వుడు మనుషుల్ని సంరక్షిస్తున్నాడనడానికి రుజువుల్లేకపోవడం ప్రశ్నలూ - హేతువాదమూ రంగంలోకి రాగానే, మ నుషుల మనసుల్లో మత విశ్వాసాలు ఇగిరిపోవడం, ఎగిరిపోవడం జరుగుతూ వస్తోందన్నది సారాంశం. 

ప్రపంచంలోని ఎక్కువ దేశాలలో పరిస్థితి దాదాపు ఇలా గే ఉంది. అంతర్జాలంలో కావల్సినన్ని సర్వే రిపోర్టులున్నా యి. కావల్సిన వారు వెతుక్కుని విషయం నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకటి మాత్రం నిజం - నిస్సందేహంగా రాబోయే కాలాల్లో పుక్కిటి పురాణాల్ని, కట్టుకథల్ని నమ్ముతూ బతికే వారి సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఇంట్లో కనబడే దేవతలు గా చెప్పబడే అమ్మానాన్నల సలహా సంప్రదింపులు లేకుండా నే సొంత నిర్ణయాలు తీసుకుంటున్న నేటి తరం.. ఇక అసలే కనబడని, ఏ ప్రభావమూ చూపని దైవశక్తి మీద ఆధారపడతారా? సమాజం పరిపక్వ దశకు వస్తున్న కొద్దీ, జనంలో స్వయం ప్రతిపత్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాన్ని ఎవ రూ అడ్డుకోలేరు. మార్పును ఆపడం ఎవరివల్లా కాదు. కానీ వైజ్ఞానిక దృష్టికోణం లోంచి రాగల తరాల్ని మానవతావా దం వైపు మళ్ళించగలిగితే... ఆరోగ్యకరైమెన సమాజం రూపుదిద్దుకుంటుంది. ‘విశ్వాసాలు జనాన్ని విడదీస్తాయి. ప్రశ్నలు కలుపుతాయి’- అని అన్నాడు సర్ పీటర్ అలెగ్జాం డర్ ఉత్సినోవ్. బ్రిటిష్ రచయిత, నటుడు, దర్శకుడు. అలాంటి భావనలతోనే కాబోలు విశ్వజనుల్లో చాలామంది మతవిశ్వాసాల్లోంచి బయటపడి, స్వేచ్ఛాలోచన వైపు దృష్టి మరలుస్తున్నారు. మనదేశ గణాంకాల ప్రకారం నిరీశ్వరవాదుల లెక్కలేవీ ఉండవు. 

కానీ 2015లో విడుదైలెన 2011 నాటి గణాంకాల ప్రకారం మనదేశంలో మూడు కోట్ల మంది తమకు ‘మతం లేదు’ అని ప్రకటించిన వారున్నారు. అంటే ఇందులో హేతువాదులు, నాస్తికులు, మానవతావాదులు ఉన్నట్టే కదా? కొద్దిపాటి తేడాలున్నప్పటికీ స్థూలంగా వీరం తా ఒక్కటే! ద్రవిడార్‌కజమ్ రాజకీయ పార్టీ నాయకుడు కె.వీరమణి చెప్పిన ప్రకారం, మతం లేదన్న ప్రజల గణాం కాలు తొలిసారి వెల్లడయ్యాయి. అయితే నిజానికి ఈ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. కార ణం ఏమిటంటే, చాలామంది మతం గురించి మాట్లాడితే తమ గురించి తోటివారు శత్రుభావన పెంచుకుంటారేమో - మతం లేదంటే తమని తక్కువగా చూస్తారేమో- నిరీశ్వరవాదులమని చెప్పుకుంటే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే.. అనుమానాలతో, భయాలతో, తమ అభిప్రాయం, ఉద్దేశం ధైర్యంగా, స్వేచ్ఛగా చెప్పుకోరు. ఏదో ‘నలుగురితో నారాయణ’ లాగా పోతే సరి - ‘ఎందుకు లేని పోని గొడవలు?’ - అనుకునే పిరికి మనస్తత్వం గలవారు మతం మీద తమ స్పష్టైమెన వైఖరేదో వ్యక్తీకరించరు- అన్న ది కొందరు మనస్తత్వ శాస్త్రజ్ఞులు వెలిబుచ్చిన అభిప్రాయం!

2006లో డెంట్యూ కమ్యూనికేషన్ ఇనిస్టిట్యూట్, జపాన్ పరిశోధనా కేంద్రం జరిపిన వరల్డ్ వాల్యూ సర్వే ప్రకారం 6.6 శాతం భారతీయులు తమకు మతం లేదని ప్రకటించుకున్నారు. విన్ గాలప్ గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ రిలిజియన్ అండ్ ఎథీజమ్ - ప్రకారం భారత్‌లో మత విశ్వాసం లేనివారి శాతం 13 శాతానికి పెరిగింది. మనం పైన విశ్లేషించుకున్న విలువలే దాదాపు ఇతర సర్వేలు వెల్లడించాయి. వేరు వేరు సంస్థలు వేరు వేరు సర్వేలు నిర్వహించొచ్చు. వాటి పలితాలు కొంచెం అంటు, ఇటుగా కూడా ఉండొచ్చు. కానీ స్థూ లంగా మనం చూడవల్సిందేమంటే - ఫలితాలు ఏం చెపుతున్నాయన్నదే ముఖ్యం! అంతర్గతంగా సమాజంలో ఏ భావన ప్రవహిస్తోంది అన్నదే ముఖ్యం!! సమాజంలో వైజ్ఞానిక స్పృహ పెరుగుతున్న కొద్దీ, మత విశ్వాసాలు తగ్గుముఖం పడుతున్నాయి. దైవభీతిలోంచి జనం విముక్తులవుతున్నారు అన్నది సారాంశం!

English Title
Declining divinity in the world
Related News