ఎంఆర్‌ఎఫ్ లాభాల్లో క్షీణత

Updated By ManamThu, 11/08/2018 - 23:03
mrf

mrfన్యూఢిల్లీ: టైర్ల తయారీ దిగ్గజం ఎంఆర్‌ఎఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.263.04 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు 2017-18 రెండో త్రైమాసికంలో రూ. 299.92 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వచ్చిన లాభాలతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో గడించిన లాభాలు 12.29 శాతం తక్కువ. 2018-19 క్యూ2లో రూ. 4,004.85 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. కాగా అంతకు క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఈ ఆదాయం రూ. 3,660.22 కోట్లుగా ఉంది. కాగా, 2019 మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు మూడు రూపాయల ఇన్‌టర్మ్ డివిడెంట్‌ను ప్రకటించింది. దీనికి కంపెనీ డెరెక్టర్ల బోర్డు అనుమతి లభించినట్లు ఎంఆర్‌ఎఫ్ పేర్కొంది.

Tags
English Title
Decrease in MRF profits
Related News