ఫేస్‌బుక్‌ను డిలీట్ చేసేయండి

Updated By ManamWed, 03/21/2018 - 12:11
facebook representational
  • వాట్సాప్ సహ వ్యవస్థాపకుడి ట్వీట్

Delete facebook says whatsapp cofounder

కాలిఫోర్నియా: ఫేస్‌బుక్.. ఆనందమేసినా, బాధేసినా, ఎక్కడికైనా టూర్‌కెళ్లినా, గుడికెళ్లినా, ఫ్రెండ్స్‌తో పార్టీ చేసినా ఏం చేసినా వెంటనే ఆ క్షణాలను, జ్ఞాపకాలను ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తే ఆ కిక్కే వేరు కదా. మరి, అలాంటి ఫేస్‌బుక్‌ను డిలీట్ చేసేస్తారా...? ఎంతమాట.. డిలీట్ చేయాలా? ఎందుకు చేయాలి? అని చాలా మంది నుంచి సమాధానం వస్తుందేమో. కానీ, వాట్సాప్ సహవ్యవస్థాపకుడు (ఇప్పుడు ఆ వాట్సాప్ ఫేస్‌బుక్ సొంతమన్న విషయం తెలిసిందే) బ్రియన్ యాక్టన్.. ఫేస్‌బుక్‌ను డిలీట్ చేసేయాలని సూచిస్తున్నారు. బుధవారం ఆయన తన ట్విట్టర్‌లో ఆ విషయాన్ని పోస్ట్ చేశారు. ‘‘ఫేస్‌బుక్‌ను డిలీట్ చేయండి. ఇదే సరైన సమయం’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఆయన అలా ట్వీట్ చేయడానికి కారణమూ లేకపోలేదంటున్నారు సామాజిక మాధ్యమ నిపుణులు. రాజకీయ సమాచార విశ్లేషణ సంస్థ కేంబ్రిడ్జ్ అనాలిటికా.. 5 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని అనుమతి లేకుండానే లీక్ చేశారన్న ఆరోపణల వల్లే ఆక్టన్ ఈ ట్వీట్ చేసి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. మరోవైపు 2014లో వాట్సా్ప్‌ను 1900 కోట్ల డాలర్లకు ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. అమ్మేసినా కొన్ని రోజుల పాటు ఫేస్‌బుక్‌తోనే కొనసాగిన ఆక్టన్.. సిగ్నల్ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించేందుకు ఈ ఏడాది ప్రారంభంలోనే ఫేస్‌బుక్‌ను వీడారు.

English Title
Delete facebook says whatsapp cofounder
Related News