కేరళకు కేజ్రీవాల్ సర్కార్ విరాళం..

Updated By ManamFri, 08/17/2018 - 20:17
Delhi govt is making a contribution of Rs 10 cr for Kera

Delhi govt is making a contribution of Rs 10 cr for Kera

ఢిల్లీ: గత కొద్దిరోజులుగా భారీ వరదలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి తమవంతు సాయం చేస్తూ సామాన్యులకు మొదలుకుని సెలబ్రిటీలు, సీఎంలు అందరూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కేరళకు ఆర్థిక సాయంచేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున రూ. 10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారు. కేరళ సీఎంతో మాట్లాడిన కేజ్రీవాల్ వరదల తెలుసుకున్న ఆయన చలించిపోయి తనవంతుగా ‘కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌’కు ఆర్థిక సాయం చేశారు. ఈసందర్భంగా మాట్లాడిన ఢిల్లీ సీఎం.. కేరళలోని మన అక్క, తమ్ముళ్ల కోసం ప్రతి ఒక్కరూ మీకు తోచినంతగా సాయం ప్రకటించాలని ఆయన కోరారు.

కాగా.. భారీ వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కేరళకు తన వంతు సాయంగా ఏపీ ప్రభుత్వం రూ. 5 కోట్లు విరాళం అందజేసింది. ఈ సందర్భంగా కేరళ సీఎంకు ఫోన్ చేసిన చంద్రబాబు ఎప్పటికప్పుడు సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు.

English Title
Delhi govt is making a contribution of Rs 10 cr for Kerala
Related News