‘దేశంలో దొంగలు పడ్డారు’ సాంగ్ 

Updated By ManamSat, 09/08/2018 - 13:56
Desamlo Dongalu Paddaru song released
Desamlo Dongalu Paddaru song released

ప్రముఖ హాస్యనటుడు అలీ సమర్పణలో ఖ‌యూమ్‌, తనిష్క్, రాజ‌న్‌, షానీ, పృథ్విరాజ్‌, స‌మీర్‌, లోహిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `దేశంలో దొంగ‌లు ప‌డ్డారు`. సారా క్రియేషన్స్ ప‌తాకంపై రూపొందిన ఈ చిత్రానికి గౌత‌మ్ రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ర‌మా గౌత‌మ్ నిర్మాత‌. శాండీ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర పాటలు సెలెబ్ కనెక్ట్ మ్యూజిక్ ద్వారా   విడుదలవుతున్నాయి. 

ఈ సినిమాలోని ‘షరతుల పంజరమే’ అనే పాటను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. దేశంలో దొంగలు పడ్డారు అనేది పాపులర్ టైటిల్.  ఇప్పుడదే టైటిల్‌తో నేటి జనరేషన్ కు తగ్గట్టుగా కరెంట్ ఇష్యూస్‌తో దర్శకుడు ఈ సినిమా చేయటం మంచి ప్రయత్నం.‌ నటుడిగా ఖయ్యుమ్‌కు ది బెస్ట్ మూవీగా నిలవాలి. దర్శకుడి గౌతమ్ రాజ్ కుమార్  టేకింగ్ , విజువల్స్ ది బెస్ట్ అనేలా‌ ఉన్నాయి. టీజర్, సాంగ్ నాకు చాలా నచ్చాయన్నారు.

ఖ‌య్యుమ్ మాట్లాడుతూ.‌..సాంగ్ విడుదల చెసిన శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు.నటుడిగా వంద సినిమాలు చేశాను.  నా కంటూ ఓ డ్రీమ్ రోల్  ఉంది. అది ఈ సినిమాలో చేశాను. టీమ్ అంద‌రూ క‌ష్ట‌ప‌డి పనిచేశారు. మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ మీద ఉంటుంది. నా లైఫ్‌లో చెప్పుకునే సినిమా అవుతుందన్నారు.

ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇదొక క్రైమ్ థ్రిల్ల‌ర్‌. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ, ఇప్పుడు స‌మాజంలో జ‌రుగుతున్న ప‌రిస్థితుల‌ను ప్ర‌తిబింబిస్తూ క‌థ‌ను తెర‌కెక్కించామన్నారు.

సెలెబ్ కనెక్ట్ అధినేత సుమన్ మాట్లాడుతూ ..  సినిమా నచ్చి మూవీ కి సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాము. సెలెబ్ కనెక్ట్ మ్యూజిక్ ద్వారా పాటలను విడుదల  చేస్తున్నాము.ఇకపై కూడా ఇలాంటి మరిన్ని మంచి సినిమాలను ప్రోత్సహించాలన్నదే మా అభిలాష అన్నారు.

గిరిధ‌ర్‌, జ‌బ‌ర్ద‌స్త్ రాఘ‌వ‌, వినోద్‌, త‌డివేలు త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. ఈ సినిమాకు కెమెరా: శేఖ‌ర్ గంగ‌న‌మోని, సంగీతం: శాండీ, ఎడిటింగ్‌: మ‌ధు.జి.రెడ్డి, క‌ళ‌: మ‌ధు రెబ్బా, సమర్పణ: అలీ,ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: సాయికుమార్ పాల‌కుర్తి, స‌హ నిర్మాత‌లు: సంతోష్ డొంకాడ‌, సెలెబ్.

English Title
Desamlo Dongalu Paddaru movie song released by hero srikanth
Related News