డెస్టినేషన్ వెడ్డింగ్

Updated By ManamThu, 08/23/2018 - 08:09
kerala

డెస్టినేషన్ వెడ్డింగ్ ఈ మధ్యకాలంలో ఎక్కువ వాడుకలోకి వచ్చింది. సెలబ్రిటీలంతా ‘డ్రీమీ వెడ్డింగ్’ కోసం దీన్ని ఎంచుకుంటూ ఉండటంతో సామాన్యులు కూడా ఇలాంటి వివాహంపై శ్రద్ధకనబరుస్తున్నారు.  మూడు ముళ్లకు ఇంత అవసరమా అనకండి.. మనసుతో చేసుకునే మనువు జీవితకాలంపాటు పదిలంగా దాచుకునే అనుభూతులను మిగల్చాలంటే ఇలాంటి హైలైట్ ఉంటే బావుంటుంది కదా?

ఆగ్రా
imageప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్ చూసేందుకు వచ్చే ప్రేమికులు ఎంతమందో ఇక్కడే దంపతులుగా మారేందుకు ఇష్టపడేవారు అంతమంది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ ఉన్న ఆగ్రా పెద్ద చారిత్రాత్మక నగరం. ఇక్కడున్న పలు వారసత్వ, ఆధునిక హంగుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లితంతు జరపవచ్చు. 

గోవా
ఈ పేరు వినగానే మీరు పెళ్లికి పిలవకపోయినా పొలోమని మీకు అయినవారు, కానివారు, ఇరుగు-పొరుగువారు, వేలువిడిచిన... బాదరాయణ సంబంధాలు కలిపేసుకుని మరీ వచ్చి మీ పెళ్లికి వాలిపోతారు!. గోవా అంటే ఆబాలగోపాలానికి అందరికీ సరదానే. సుందరమైన గోవా బీచుల్లో ఇసుక తెన్నెలపై వివాహం చేసుకోవడమంటే ఊహలకు రెక్కలు వచ్చినట్టు ఉంటుంది.

విదేశాలెందుకు దండగ?
డెస్టినేషన్ వెడ్డింగ్ అనగానే ఫారిన్ గుర్తుకు రావడం చాలా సహజం..కానీ మనదేశంలో అత్యద్భుత ప్రదేశాలు బోలెడుండగా విదేశాలెందుకు? పాస్‌పోర్టు, వీసాతో ఏమాత్రం పనిలేకుండా హ్యాపీగా మీకు నచ్చిన బడ్జెట్‌లో, మీరు మెచ్చిన చక్కని ప్రదేశంలో వివాహం చేసుకోండి. అది నవదంపతులకే కాదు అయినవారందరికీ మధుర జ్ఞాపకాలను ఇవ్వడం ఖాయం. ఇందుకు ముందు మీరు చేయాల్సిందల్లా ఒకటే.. మీరు కోరుకునే వెడ్డింగ్ ఏ కేటెగెరీకి చెందినదో గుర్తించండి.. అంటే బీచ్‌లోనా లేక నదీ తీరంలోనా అదీకాకపోతే చారిత్రాత్మక ప్రదేశంలోనా ఇలా మీకు స్పష్టత వచ్చిందో డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా సింపుల్ ప్రాసెస్ అవుతుంది. 

ఉదయ్‌పూర్
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రాయల్‌గా వెడ్డింగ్ జరుపుకునేందుకు పర్‌ఫెక్ట్ ప్లేస్. బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరో ఒకరిimage వివాహం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడున్న ఎన్నో రాజసౌధాలు ముఖ్యంగా పిచోలా లేక్‌లోని తేలియాడే రాజమహల్, తాజ్ లేక్ ప్యాలెస్ అతిథులను కనివినీ ఎరుగని రీతిలో స్వాగతిస్తుంది. ఓవైపు కొండలు మరోవైపు చుట్టూ ఉన్న బోలెడన్ని సరస్సుల మధ్య ఉన్న ఉదయ్‌పూర్ సిటీలో వివాహం అంటే వావ్ అనిపించేలా ఉంటుంది.

కాశ్మీర్
‘‘భూలోకంలో స్వర్గమనేది ఉంటే అది ఇక్కడే ఉంది’’ అనే పేరు సంపాదించుకున్న ప్యారడైజ్ ఆన్ ఎర్త్.. కాశ్మీర్. కొండలు, వాగులు, వంకలు, మంచు, పూల లోయలు..ఇలా ఇక్కడ మీకు నచ్చిన చోటును ఎంపిక చేసుకుని పిక్చర్ పర్‌ఫెక్ట్ మ్యారేజ్  చేసుకోవచ్చు. ఏటా ఎంతోమంది విదేశీయులు ఇక్కడ మనువాడేందుకు వస్తున్నారు. ఇలా మీరు కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు ‘జన్నత్’ కంటే మరో అద్భుతమైన వేదిక ఏముంటుంది?

జైపూర్
డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే అందరికీ ఠక్కుమని గుర్తుకు వచ్చేది ‘పింక్ సిటీ జైపూర్’. ఒక్కమారు ఈ చారిత్రాత్మక నగరంలో మీవారందరి సమక్షంలో మీరు పెళ్లి చేసుకుంటే.. ఎంత కమ్మని కలనో.. అనేలా ఉంటుంది. గ్రాండ్‌గా ఉన్న రాజమందిరాలు, కళ్లు చెదిరే హోటళ్లు, రీసార్టులు ఇలా మీకు నచ్చిన వేదికపై వివాహం జరుపుకునే సౌలభ్యం ఉంది. 

కేరళ
imageఇప్పుడైతే వరదల్లో మునిగింది కానీ..అసలు పెళ్లంటూ చేసుకుంటే స్వచ్ఛమైన ప్రకృతికి చిరునామా అయిన కేరళలో చేసుకోవాలి. బ్యాక్‌వాటర్, హౌస్ బోట్లు.. ఇలాంటి హంగులమధ్య ఏడడుగులు నడవడమంటే ఏదో సినిమా చూసిన ఫీలింగ్ కలుగకమానదు. కోవళం, వర్కాల, మున్నార్, కొల్లం, అలెప్పీ, కుమారకోం..అబ్బో ఇక్కడ ఎన్నో చూపుతిప్పుకోనివ్వని వేదికలున్నాయి.
 
విదేశాలెందుకు దండగ?
డెస్టినేషన్ వెడ్డింగ్ అనగానే ఫారిన్ గుర్తుకు రావడం చాలా సహజం..కానీ మనదేశంలో అత్యద్భుత ప్రదేశాలు బోలెడుండగా విదేశాలెందుకు? పాస్‌పోర్టు, వీసాతో ఏమాత్రం పనిలేకుండా హ్యాపీగా మీకు నచ్చిన బడ్జెట్‌లో, మీరు మెచ్చిన చక్కని ప్రదేశంలో వివాహం చేసుకోండి. అది నవదంపతులకే కాదు అయినవారందరికీ మధుర జ్ఞాపకాలను ఇవ్వడం ఖాయం. ఇందుకు ముందు మీరు చేయాల్సిందల్లా ఒకటే.. మీరు కోరుకునే వెడ్డింగ్ ఏ కేటెగెరీకి చెందినదో గుర్తించండి.. అంటే బీచ్‌లోనా లేక నదీ తీరంలోనా అదీకాకపోతే చారిత్రాత్మక ప్రదేశంలోనా ఇలా మీకు స్పష్టత వచ్చిందో డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా సింపుల్ ప్రాసెస్ అవుతుంది. 

లావాసా
పూనే సమీపంలోని హిల్ స్టేషన్ లావాసా అంటే జలపాతాలు, కొండలు, సరస్సులు మధ్య అలరారే ప్రకృతి ఒడిలో పెళ్లి చేసుకోవడానికి దేశవిదేశాల్లోని యువత ఆసక్తి చూపుతోంది. పైగలైనా రాత్రైనా మంత్రముగ్ధుల్ని చేసే లావాసాలో సిటీలో ఉండే హంగులన్నీ ఉంటాయి. కనుక వివాహానికి ఎటువంటి అసౌకర్యాలు ఉండవు.

సింపుల్ బడ్జెట్‌లోనూ..
వామ్మో ఇలాంటి టూరిస్టు స్పాట్‌ల్లో పెళ్లంటే మాటలా అనుకోకండి. మీకు కావాల్సిన బడ్జెట్‌లో, సంప్రదాయాల్లో పెళ్లిimage ఏర్పాట్లు చేసే వెడ్డింగ్ ప్లానర్స్ విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈకాలంలో జస్ట్ రేపు పెళ్లి అంటే ఈరోజు ఆర్డర్ బుక్ చేసినా మీకు నచ్చిన చోట, నచ్చినట్టు వివాహం జరిపించేస్తారు. ఇవన్నీ వద్దనుకుంటే మీరు సెలెక్టివ్‌గా సన్నిహితులను తీసుకుని, వెంట పంతులు, వంటవారు, పనివారిని తీసుకెళ్తే మరీ చవక గా పెళ్లి చేసేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎకానమీ రూమ్స్ బుక్ చేసుకుంటే చవకగా, ఘనం గా పెళ్లి జరిపించవచ్చు. కావాలంటే మీ ఊళ్లో రిసెప్షన్ ఇచ్చి మిగతా అందరినీ ఆహ్వానిస్తే సరి. రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే లాంచీల్లో వివాహాలు ఎప్పటినుంచో నిర్వహిస్తున్నారు.  మన తెలుగు రాష్ట్రాల్లో వారు ఇతర రాష్ట్రాలు వద్దనుకుంటే ఇలాంటి ఎన్నో వేదికలు మనకు సమీపంలోనే ఉంటాయి, వాటిని గుర్తిస్తే సరి.

English Title
Destination Wedding
Related News