ధర్మ సందేహాలు

Updated By ManamTue, 08/07/2018 - 02:31
Dharma

దీపారాధన గాలికి కొండెక్కితే అపశకునంగా భావిస్తారు.  ఇది సరైన పనేనా? 
imageదీపారాధనను ఆర్పకపోవడం మన సంప్రదా యం. ఇది అగ్నిఆరాధనలో భాగం. యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు సమిధలతో ఆహుతులు సమర్పిస్తారు. అక్కడ జ్వాల పెరిగితే, పాలు కలిపిన నీళ్లు చిలకరించి నియంత్రిస్తారు. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటినుంచి భూమి, భూమిపైన ఓషధుల సాయంతో అన్నరూపంగా ఈ పంచతత్వాలను స్వీకరించి మనిషి ఏర్పడ్డాడు. అగ్ని పెరగడానికి గాలి సాయపడుతుంది.

అగ్ని చిన్నదిగా ఉంటే అదే గాలి ఆర్పివేస్తుంది. మనలోని జ్ఞానాగ్నికి దీపం ప్రతీక. అది నిరంతరం వెలుగుతూ ఉండాలి. అందుకే దీపం ఆరిపోతే అపశకునం అంటారు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటామా? రక్షించుకోవడం మన బాధ్యత. అప్పుడే కొండెక్కిన దీపాన్ని మరోసారి వెలిగించవచ్చు. నిన్నటిరోజు చేసిన దీపారాధనలో మాత్రం నూనె, వత్తి కొత్తవి వేయకుండా దీపారాధన చేయ కూడదు. 

English Title
Dharma doubts
Related News