మెంటర్‌గా మారిన ధోనీ

Updated By ManamTue, 09/18/2018 - 23:52
Dhoni

imageవన్డే జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసి చాలా కాలం అయినప్పటికీ ఆసియా కప్ మ్యాచ్‌ల సందర్భంగా జట్టు సహచరులకు మహేంద్ర సింగ్ ధోనీ సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. విరాట్ కోహ్లీ మాత్రమే కాదు జట్టులోని మిగతా సభ్యులు కూడా ధోనీని మెంటర్‌గా (గురువుగా) భావిస్తున్నారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రి లేని కారణంగా హాం కాంగ్‌తో మ్యాచ్‌కు నెట్ ప్రాక్టీస్‌లో ధోనీ మెం టర్‌గా వ్యవహరించాడు. శాస్త్రితో పాటు ఇత ర సపోర్ట్ స్టాఫ్ ఇంకా యూఏఈ చేరుకో కపోవడంతో ధోనీ ఈ బాధ్యతలు చేపట్టాడు. ఆసియా కప్‌లో భారత బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్ కోసం ఇండియా-ఎ బౌలర్లు అవేశ్ ఖాన్, ఎం. ప్రసిద్ధ్ క్రిష్ణ, సిద్ధార్థ్ కౌల్, షాబాజ్ నదీమ్, మయాంక్ మార్కండేలను బీసీసీఐ యూఏఈకి పంపింది.

English Title
Dhoni who has become a mentor
Related News