డిక్షన్ పేరుతో డిక్టేటర్‌షిప్!

Updated By ManamSun, 03/11/2018 - 22:21
image

imageఈ మధ్యకాలంలో రాజకీయాలలో కనిపించే నియంతల ధోరణులు మన తెలుగు సాహిత్యంలో ప్రవేశిస్తున్నాయి. కొద్దికాలంగా ఈ ధోరణులు డిక్షన్ పేరు తో మొదలై డిక్టేటర్‌షిప్‌గా కూడా మారింది. అందుకు తాజా ఉదాహరణ బిక్కి కృష్ణ విడుదల చేసిన ‘కవి త్వం-డిక్షన్’ వ్యాస సంక లనం కనిపిస్తుంది. ఇందులో ఆధునిక వచన కవిత - నిర్మాణ పద్ధతులు అంటూ నేటి మన కవిత్వంపై కూర్చిన వ్యాసాలు, అనుబంధంగా మరో రెండు ఉన్నాయి. ఈ పుస్తకం అంతటా తాను చెప్పే విషయా లందు నియంత పోకడలే కనిపిస్తు న్నాయి. ఉదాహ రణకు ‘ప్రతి ఊహ ఒక వ్యూహం’ అనే వ్యాసంతో ఒక చోట ఇలా రాశారు. ‘చక్కని తెలుగు పదాలు, పద బంధాలు ఉన్నప్పటికి ఆంగ్లపదాలను ఇ రికిస్తే, అదేదో గొప్ప కవిత్వమనుకుంటారని అవసరం లేకు న్నా ఆంగ్లపదాలను కృతకభాషను సృష్టించుకుం టున్నారు’ అంటారు బిక్కి కృష్ణ. ఇందుకు మనకు ఒక ఉదా హరణ కూడా చూపాలని అటువైపు ప్రయత్నమే చేయరు. తెలుగు భాషలోకి ఇవాళ వచ్చే ఆంగ్లపదాలు రోజురోజుకీ పెరుగుతున్న దానికి పై సందర్భం ఉదా హరణగా ఉంటుంది. అయితే మీరు ఈ రచనలో ఒక్క వ్యాసం రాయటానికి ఇంగ్లీషు పదాలు ఎన్ని ఉన్నాయో ఎప్పుడైనా లెక్కించారా? కనీసం ఓ యాబై ఆంగ్ల పదా లు అనేకమార్లు దొర్లించేశారు. దీన్ని ఏమంటారు? ఎదుటివారిని తప్పుపట్టే ఆలోచన చేయటంలో కనిపిం చే నియంతధోరణి తనకు మాత్రం వర్తించదా? ఇలాం టివే ఈ రచన నిండా ఎదురివారిని ఎత్తి పొడవటం, తను మాత్రం అందుకు అతీతంగా లేకున్నా, ఉన్నట్టు గా రాతల్లో కనిపించటం చాలా ఎక్కువ శాతం కని పిస్తుంది. అందువలన ఏర్పడే గందరగోళాలన్నీ ఇన్నీ కావు. పై వ్యాసంలోనే చివరి వాక్యాలు ఇలా ఉన్నాయి. ‘నీ లోపాలు చెప్పేవాడే నిజమైన మిత్రుడు. కవిత్వం లోనూ, జీవితంలోనూ అన్నది మరిచిపోకు’ అని ము గించారు. నా ఈ ప్రయత్నం ఇక్కడ నుంచే మొద లైంది. శ్రీశ్రీ మహా ప్రస్థానం నుంచి మాట్లాడటం మొ దలుపెట్టి మరో ప్రస్థానంతో శ్రీశ్రీ కవితా డిక్షన్ మారి పోయిందని సెలవిచ్చారు. (ఈ డిక్షన్ అనే మాట ఎన్నిసార్లు వస్తుందో లెక్కేలేదు) అందుకు దారిచూపి న పరీక్షలు పరిస్థితుల ఊసే కనిపించదు. ఊపిరి తీసే సి బొమ్మను చూపటమంటే ఇదే! మహాప్రస్థానం గేయాల పుట్టుకకు ప్రధాన నేపథ్యమైన ఆంగ్రీథర్టీస్‌ను గురించి కేవలం నామమాత్రంగానే ఉచ్చరించినా, మ రో ప్రస్థానం గూర్చిగానీ, దాని నేపథ్యాన్ని గురించి నామమాత్రంగా కూడా చెప్పకుండానే భాషలో అభి వ్యక్తిలో వచ్చిన మార్పును ఎలా గుర్తించటం చేస్తారో గానీ, శబ్దచిత్రణ కవిత్వం కాదని శ్రీశ్రీ తెలుసుకున్నా డని కృష్ణ రాశారు. మార్పుకు సంబంధించిన మూలా లు శ్రీకాకుళ పోరాటం వైపునే ఉన్నాయి. ఈ విషయా ల్ని శ్రీశ్రీనే అనేక సందర్భాలలో చెప్పారు. కీలకమైన ఈ అంశాన్ని ఎలా వదిలేసి ‘మార్పు’ను గూర్చి ఎలా ముచ్చటిస్తారు? అలాగే, ఊహకీ వ్యూహనికి ఉన్న వ్యత్యాసాన్ని కూడా అసలు పట్టించుకునే ప్రయత్నమే చేయకుండా పోయారు. అనిర్ధిష్ట రూపంలో ఉండేది ‘ఊహ’ ఒక నిర్దిష్ట రూపంతో కొనసాగేది ‘వ్యూహం’ దేనికుండే పరిధి దానికి స్పష్టంగా ఉన్నాయి. అయినా, ఇలాంటి పదప్రయోగం చేశారంటే ఆయనలోని గందర గోళాల్ని పాఠకుల ముందుపెట్టి వారినీ గందరగోళం చేసే ప్రయ త్నమే ఇది. ఇలాంటిదే మరొకటి ‘రుచికరమైన వంట ను చూడగానే నోట్లో లాలాజలం ఊరినట్టి కవిత్వాన్ని చదవగానే కాసేపైనా ఆశ్చర్యం కలగాలి’ అంటారు. ఇదో చౌకబారు విశ్లేషణ కవిత్వంపై ఎటువంటి విశ్వా సాలు లేకుండానే. ఇవాళ మన ముందుకొస్తున్న కవి త్వాన్ని గానీ, కవులనుగానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, కొన్ని చేదునిజాలు బయట పడతాయి. గారడీ వాని మాటల్లాగా, అల్లిక పని తెలిసిన లేదా నైపుణ్యం ఉన్న వారిలాగా కనిపి స్తారు. నిజాయితితో కనిపించే రచన కనిపించటం చా లా కష్టమైపోతుంది. అన్నింటా ఆశ్చర్యార్థకాలే. ఇంగ్లీ షు చదువుల్లోకి పంపుతూ, మాతృభాషపై కవితలల్లే నైపుణ్యం కనిపిస్తుంది. కవిత్వ నిర్మాణంలో ఉండే అంశాలు, మరీ శుద్ధ మాటల గారడీలుగా కనిపిస్తాయి తప్ప జీవం తొణికిస లాడుతున్నట్టుగా ఈ వ్యా సాలు లేవు. ప్రాణంలేని తనంతో కవిత్వాన్ని తయారు చేసేందుకు ఈ రచన దోహదపడ తుందేమో కాలం చెల్లిన పదాల విన్యా సాలను గూర్చి మళ్ళీమళ్ళీ ఇక్కడ ముచ్చటిం చటం ఉంది. తోటమాలి గిలకబావి కవిత్వ పు తాబేలును పైకి లాగటం ఎందుకోఏమో, కవికైనా తెలుసోలేదో! భోజనం ముందు కూర్చొని ఎన్నెన్ని నాజూకులైనా వెళ్ళే మనుషులు న్నారు. కానీ, అసలు భోజనం ఎందుకు చేస్తామో మరిచి పోకూడదుగదా! ఇలా కొనసాగించిన దానికి మరింత వికృత రూపం ‘కవిత్వ ముద్రణ ఒక కళాత్మక క్రియ! అనే వ్యాసం. కొత్తగా రాసే కవులు సంకలనా లుగా వారి కవిత్వాన్ని కూర్చే దగ్గర 12 రకాల అంశాలు తప్పక పాటిం చాలని ఒకవిధంగా శాసించే పద్ధతి లోనే కృష్ణ తన అభిప్రాయాలు వెల్లడించారు. నియంత ధోరణిలో సాగే ఆరోపణలు కోకొల్లలుగా దర్శనమిస్తాయి. కవులు వారి కవర్ పేజీలపై కవుల బొమ్మలు వేయించుకోవటం ఫ్యాషన్ అయిందని వాపోవటం ఎందుకు? మహా ప్రస్థానానికి మా గోఖలే గీసిన ముఖ చిత్రం సంగతి ఎలా మర్చిపోయారు? కవర్‌పేజీని ‘సింబాలిక్’ ఉండా లని మంచి సూచనే చేశారు. కానీ, ఈ పుస్తకానికే వేసిన ముఖచిత్రంలో ఏమాత్రం సింబాలిక్ ఉంది? కవిత్వానికిగానీ, డిక్షన్ అనే పదానికి గానీ ఇందులోని ఏ ఒక్క అంశానికి గానీ దగ్గర సంబంధంతో ఈ ముఖచిత్రం వచ్చిందా? ఇవాళ కవిత్వంగానీ, డిక్షన్ గానీ ఇలా ఉన్నాయని అంటారా సింబాలిక్‌గా. కవితా సంపుటి బ్యాక్ పేజీలో కవి పరిచయం వెయ్య కూడ దట. కవిత్వ పరిచయం ఉంటే, అవి వేసుకొని కవి పరిచయాన్ని లోపలి పేజీల్లో ఉంచాలట. అంటే ముందుమాటల్లో కొంతభాగాన్ని తిరిగి చివరిపేజీలో ముద్రణ చేయటంలో కొత్తగా ఒనగూడేది ఏమిటో గమనిస్తే, పబ్లిసిటీ కోసం మాత్రమే ఇలా చేస్తారు గా నీ, మరో ప్రయోజనం అక్కడ ఒనగూడదు. సూచ నలు చెయ్యటం తప్పుగాదు కానీ, అవతలి వారిని తక్కువ చేయటం సరికాదు.  బిక్కి వాడే పరుష ప దాలు, అసందర్భ ప్రేలాపనల మధ్య కూడా అతని కవితాభిమానం గౌరవిద్దాం. ఎవరి స్వేచ్ఛ అయినా, ఎదుటివారిని ఇబ్బంది కలిగించేది కాకుడదు! కవుల్ని, కవిత్వాన్నీ వస్తువుతోనే ప్రేమిద్దాం! విశ్లేషిద్దాం!!
నియంతల్లాంటి విమర్శకుల్నీ ప్రజాస్వామ్య వాదుల్ని చేద్దాం!!!
 sajja

 

 

సజ్జా వెంకటేశ్వర్లు

English Title
Dictatorship in the name of diction
Related News