మును‘గోడు’ పట్టదా?

Updated By ManamSat, 09/22/2018 - 01:13
all party logo

all partyఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నుంచి ఎన్నోఏళ్ళుగా ఆగ్రకులాల నాయకులే ఎమ్మేల్యేలుగా కొనసాగుతూ వస్తున్నారు. వాస్తవానికీ మునుగోడు నియోజకవర్గంలో 65 శాతం ఓట్లు బీసీలవే. కానీ వాళ్ళల్లో చైతన్యం లేక ప్రతిసారీ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఆగ్రకులాల నాయకులే టికెట్లు తెచ్చుకుంటూ చట్టసభల్లోకి వెళుతున్నా సందర్భం. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలల్లో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపున్న బీసీ నాయకున్ని ప్రాంతం ఈ మునుగోడు నియోజకవర్గం, కానీ ఎమ్మెల్యే టికెట్ల విషయంలో వీరిని పక్కన బెడుతున్నారు. ఇది మా బీసీ సోదరులకు అర్థం కావడం లేదు. అసలు బీసీల్లో ఐక్యతేది! ఐక్యతుంటే మునుగోడు ఎమ్మెల్యేగా బీసీనే కావాలి? మరో గమ్మతైనా విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి బీసీ వాదాన్ని ప్రతిరోజు వినిపించేలా చేస్తున్నా నేతలున్నా ప్రాంతం కావడం అందరినీ ఆలోచింపజేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 80 నియోజకవర్గాల్లో నెల రోజులకు పైగా బస్సు యాత్ర ద్వారా బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్‌ది ఇదే నియోజకవర్గం. రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య పరిచిన మునుగోడు తమ సొంత గడ్డపై నుండీ బీసీని ఎమ్మెల్యేగా చేయలేకపోతున్నారు. మరొకరు తన మేథోశ్రమంతా తన కలంపై పెట్టి ఉద్యమంలో చురుకుగా పాల్గొని రాష్ట్ర జర్నలిస్టుల సంఘ ఉపాధ్యాక్షునిగా కొనసాగుతున్న పల్లె రవిని గుర్తిస్తారు కానీ తనకు కూడా ఏ పార్టీ గౌరవించలేదు. అదేవిధంగా పైన వివరించినా వారు తమ జాతికోసం తమ వృత్తిలో ప్రధాన పాత్ర పోషించినప్పటికీ ఏ రాజకీయ పార్టీ కండువాను కప్పుకొని వారు వాళ్లు, కానీ టీఆర్‌ఎస్ పార్టీ ప్రారంభం 2001 నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పోలీట్‌బ్యూరో స్థాయికి ఎదిగిన నేత తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదాన్నీ ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా టీవీ చర్చల్లో పాల్గొంటూ పార్టీకీ మంచి గుర్తింపు తెచ్చిన నేత కర్నె ప్రభాకర్ కూడా ఈ నియోజకవర్గానికి చెందినవారే. కర్నె ప్రభాకర్‌కు 2014 సాధారణ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యే టికెట్ చివరి నిమిషంలో చేజారిపోయింది. 

2018 లోనైనా మునుగోడు ఎమ్మెల్యే టికెట్‌ను బీసీ సామాజిక వర్గానికి చెందినా పార్టీ కోసం కష్టపడిన నేత కర్నె ప్రభాకర్‌కే ఇస్తారనుకుంటే అదీ కూడా జరగలే. కర్నె కంట్లో కన్నీళ్లున్న ముఖంపై మాత్రం ఎప్పుడూ చిరునవ్వుతో అధిష్టానం ప్రకటించిన అభ్యర్థికీ ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలకు కర్నె ప్రభాకర్ నిత్యం చెబుతున్న మాట ఎవరు అధైర్యపడొద్దు మనందరికి కేసీఆర్ ఉన్నారు. ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తా. తప్పకుండా పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే పోటీ చేస్తానని అనుకున్నట్టు సమాచారం. వేచి చూడాలి ఏమైనా రాజకీయ సమీకరణ వల్ల గెలుపు గుర్రలకే అధిష్ఠానం టికెట్లు ఇస్తే కర్నెకు అవకాశం వచ్చినట్లే అని మునుగోడు నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. అదేవిధంగా టీటీడీపీలో పట్టిన జెండాను దించని బీసీ నాయకుడు మా ప్రాంతం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదగటం మంచి పరిణామమే అనుకున్నాము. టీడీపీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నేత జక్కలి అయిలయ్య యాదవ్‌ది ఇదే నియోజకవర్గమే! తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న కూటమి ఏర్పాటుతో చేజారే అవకాశమే ఎక్కువ. కాంగ్రెస్ నుంచి మునుగోడు నియోజకవర్గంలో టికెట్లు ఆశిస్తున్న బీసీ నేతలు పున్న కైలాస్ నేత పోటీచేయలన్న తపన  ఉన్నా అవకాశం కోసం ఎదురుచూపులే. మరొక కాంగ్రెస్ నేత నారబోయిన రవి యువతకు అవకాశం ఇవ్వలని అధిష్ఠానానికి నిరంతరం ఢిల్లీ నుంచి వినతులు సమర్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల చైతన్యం సరే... మొదట తమ సొంత నియోజకవర్గంలో మునుగోడులో రావాలి. మరి మునుగోడు గట్టపై బీసీ నినాదం పనిచేస్తుందా లేదా అనేది.
 గుండమల్ల సతీష్‌కుమార్, 9493155522

Tags
English Title
Did God's Got?
Related News