ముందే తెలుసా?

Updated By ManamSun, 09/23/2018 - 22:42
rahul
  • ఆగస్టు 30నే రాహుల్ గాంధీ ట్వీట్.. తొలి ప్రకటనను ఖండించిన హోలాండే

  • ప్రభుత్వ లాబీయింగ్ గురించి తెలియదట.. కాంగ్రెస్ కంటే తక్కువకే జెట్ల కొనుగోలు

  • లెక్కల్లో తేడాలుంటే కాగ్ చూసుకుంటుంది.. రఫేల్ కొనుగోలు ఒప్పందం రద్దు కాదు

  • రక్షణదళాలకు అవి అత్యంత అవసరం.. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టీకరణ

rahul gandhiన్యూఢిల్లీ: ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే తాను చెప్పిన విషయాన్ని తానే ఖండిస్తున్నారని.. రిలయన్స్ సంస్థను డసాల్ట్‌కు ఆఫ్‌సెట్ భాగస్వామిగా నిర్ణయించడంలో ఫ్రెంచి ప్రభుత్వం గానీ, భారత ప్రభుత్వం గానీ అసలు కలగజేసుకోలేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. రఫేల్ జెట్ ఫైటర్ల కొనుగోలు ఒప్పందంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదంపై ఆయన ఆదివారం స్పందించారు. భారత ప్రభుత్వమే రిలయన్స్ పేరును ప్రతిపాదించిందంటూ హోలాండే ఒక ఫ్రెంచి వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినప్పటి నుంచి ఈ అంశంపై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపించడంతో పాటు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామాకు డిమాండ్ చేశాయి. ఈ అంశంపై ఒక టీవీ ఇంటర్వ్యూలో జైట్లీ స్పందించారు. చూడబోతే రాహుల్‌గాంధీ, హోలాండే ప్రకటనల మధ్య ఏదో ‘జుగల్‌బందీ’ ఉన్నట్లుందని ఆయన ఎద్దేవా చేశౠరు. ఫ్రాన్సులో రఫేల్ ఒప్పందంపై బాంబులు పేలబోతున్నాయని  ఆగస్టు 30న రాహుల్ గాంధీ ట్వీట్ చేశారని, ఆయనకు ఇదంతా ముందే ఎలా తెలిసిందని ప్రశ్నించారు. వారిద్దరి మధ్య మిలాఖత్ గురించి తన వద్ద ఆధారాలు ఏమీ లేవు గానీ, ఇలా ముందే చెప్పడంతో అందరికీ అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. ముందుగా హోలాండే నుంచి ఒక ప్రకటన వస్తుందని, తర్వా త ఆయనే దాన్ని ఖండిస్తారని, కానీ రాహుల్ గాంధీ మాత్రం దీనంతటి గురించి 20 రోజుల ముందే ఊహిస్తారని జైట్లీ ఎద్దేవా చేశారు. రఫేల్ జెట్ ఫైటర్ల కొనుగోలు ఒప్పందాన్ని రద్దుచేసే ప్రసక్తి లేదని, అది దేశ రక్షణ దళాలకు అత్యంత అవసరమని అవి వ చ్చి తీరుతాయని స్పష్టం చేశారు. 

కాగ్ చూసుకుంటుంది
ఈ ఒప్పందం అచ్చంగా ప్రభుత్వానికి- ప్రభుత్వానికి మధ్య జరిగిందని, చరిత్రలోనే అత్యంత స్వచ్ఛమైన, అవినీతి లేని ప్రభుత్వం న రేంద్రమోదీ ప్రభుత్వమని జైట్లీ అన్నారు. 2004-14 సంవత్సరాల మధ్య ఉన్న యూపీఏ ప్రభుత్వం అత్యంత అవినీతిమయమని మండిపడ్డారు. విమానాలను ఎక్కు వ ధరకు కొన్నామా లేదా అన్న విషయాన్ని కాగ్ పరిశీలిస్తుందని, యూపీఏ ప్రభుత్వం చేసిన బేరం కంటే తక్కువ ధరకే తాము కొనుగోలు చేశామని అన్నారు. రక్షణ ప్రయోజనాల రీత్యా కొనుగోలు ధరను బయట పెట్టకూడదన్ని ప్రభుత్వ నిర్ణయమన్నారు. అంకెలన్నీ కాగ్ వద్ద ఉన్నాయని, కాంగ్రెస్ కూడా తమ లెక్కలను కాగ్‌కు సమర్పించిందని, అందవల్ల కాగ్ విచారణ తర్వాత నిజానిజాలు ఏంటో బయటకు వస్తాయని చెప్పారు. భారతీయ సైనికుల ప్రయోజనా లను మోదీ పణంగా పెట్టారంటూ రాహుల్‌గాంధీ ఒక పనికిమాలిన ఆరోపణ చేశారని జైట్లీ అన్నారు. యూపీఏ హయాంలో ఆయుధాల సేకరణలో ఆలస్యం చేయడం వల్ల మన సైన్యం పోరాటపటిమ తగ్గిందని, ఇప్పుడు ఎన్డీయే అవే ఆయుధాలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. హోలాండే తొలి ప్రకటనతో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆయుధం దొరికినట్లయింది. ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడు స్వయం గా.. ప్రధాని మోదీని దొంగ అంటున్నారని, ఆయన ప్రకటన సారాంశం ఇదేనని, మరి దీన్ని ఖండిస్తారా, అంగీకరిస్తారా అంటూ రాహుల్‌గాంధీ సవాలు చే శారు. ఎన్డీయే ప్రభుత్వ అవినీతిని ఈ ఉదంతం స్పష్టంగా చూపిస్తోందని ఆయన ఆరోపించారు.

అసభ్య పదజాలం తగదు
రాహుల్‌గాంధీ ముందుగా ఊహించిన విధంగానే ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడు మాట్లాడారని, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని కూడా జైట్లీ అన్నారు. ఏదైనా విషయాన్ని బయటపెట్టాలంటే పద్ధతి ఇది కాదని చెప్పారు. మీరు కావాలంటే వెళ్లి ఎవరినైనా కౌగలించుకుని, తిరిగొచ్చి కన్ను కొడతారని, తర్వాత 4-6-10 సార్లు అబద్ధాలు చెబుతారని అంటూ రాహుల్‌గాంధీ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. ఏదైనా మాట్లాడితే మన తెలివి బయటపడాలని, కానీ అసభ్య పదజాలం ప్రయోగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో శోభను ఇవ్వదని సూచించారు. 

హోలాండే.. ఏది నిజం
భారత ప్రభుత్వం సూచించడం వల్లే రిలయన్స్ డిఫెన్స్ సంస్థతో డసాల్ట్ ఏవియేషన్ ఒప్పందం చేసుకుందంటూ హోలాండే చేసిన ఆరోపణలతోనే మొత్తం వివాదం తలెత్తిందని చెప్పారు. కానీ, ఆ తర్వాత సెప్టెంబరు 22న (శనివారం) హోలాండే చేసిన మరో ప్రకటనలో.. భారత ప్రభుత్వం ఎప్పుడైనా రిలయన్స్ డిఫెన్స్ సంస్థ కోసం లాబీయింగ్ చేసిందేమో తనకు తెలియదని చెప్పారని, ఏ కంపెనీ అయినా తన భాగస్వామిని తానే ఎంచుకుంటుందని అన్నారని.. మరి ఈ రెండు ప్రకటనల్లో ఏది నిజమో ఆయనకే తెలియాలని అన్నారు. హోలాండే తొలుత చేసిన ప్రకటనను ఫ్రెంచి ప్రభుత్వం, డసాల్ట్ ఏవియేషన్ రెండూ ఖండించాని గుర్తుచేశారు. ఆఫ్‌సెట్ కాంట్రాక్టులకు సంబంధించిన నిర్ణయాలను డసాల్ట్ లాంటి సంస్థలే తీసుకుంటాయి తప్ప అందులో ప్రభుత్వ జోక్యం ఏమీ ఉండబోదని ఫ్రెంచి ప్రభుత్వమే చెప్పిందని అన్నారు. తాము పలు ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలతో ఇప్పటికి చాలా ఒప్పందాలు చేసుకున్నట్లు డసాల్ట్ సంస్థే స్వయంగా ప్రకటించిందని తెలిపారు. హోలాండే తన రెండో ప్రకటనను కెనడాలోని మాంట్రియల్‌లో ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చేశారని.. దాంతో ఆయన మొదట చేసిన ప్రకటనలో వాస్తవం ఎంతనేది అనుమానస్పదంగా మారిందని చెప్పారు. పైగా హోలాండే చెప్పినట్లు ఇది భాగస్వామ్యం కాదని, అసలు జెట్‌ఫైటర్లు భారతదేశంలో తయారు కావని.. వాళ్లు కేవలం 36 ఫైటర్ జెట్ విమానాలను సరఫరా చేస్తారని వివరించారు. ఆఫ్‌సెట్ కాంట్రాక్టు అనేది డసాల్ట్ కంపెనీ మన దేశంలో పెట్టే పెట్టుబడులకు సంబంధించినదని చెప్పారు. 2016 సంవత్సరంలో 36 రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందం జరిగినపుడు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా హోలాండే ఉండేవారు.

English Title
Did you know before
Related News