ఆ వ్యాఖ్యల పట్ల నరేశ్ విచారం

Updated By ManamTue, 03/13/2018 - 16:15
Naresh Agrawal

naresh agarwalన్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీ నాయకురాలు జయా బచ్చన్‌పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల సోమవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్న సమాజ్‌వాది పార్టీ మాజీ నేత నరేశ్ అగర్వాల్ విచారం వ్యక్తంచేశారు. తనను కాదని సినిమాల్లో ఆడిపాడే వారికి సమాజ్‌వాది పార్టీ పెద్దలు రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారంటూ జయా బచ్చన్‌పై నరేశ్ అగర్వాల్ నోరు పారేసుకున్నారు. జయా బచ్చన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీతో పాటు సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తంచేసిన నరేశ్ అగర్వాల్...ఎవరి మనోభావాలు గాయపరచడం తన ఉద్దేశం కాదన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా గాయపరిచి ఉంటే...తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుటానని చెప్పారు. 
 

English Title
Didn't intend on hurting sentiments, regret it: Naresh Agrawal
Related News