మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Updated By ManamMon, 08/27/2018 - 14:17
petrol
petrol, diesel

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం డీజిల్ ధర రికార్డు స్థాయిలో పెరిగింది.  లీటర్ డీజిల్ ధర 69.46కు చేరగా, పెట్రోల్ రూ.78కి చేరింది. అంతర్జాతీయగా ముడి చమురు ధరలు పెరగడంతో పాటు రూపాయి పతనం కూడా ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. డీజిల్ ధ‌ర 14 పైసలు, పెట్రోల్ 13 పైసల మేర పెరిగింది. 

ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.69.46 పైసలు ఉండగా, ముంబైలో 73.74గా ఉంది. అలాగే పెట్రోల్ ఢిల్లీలో లీటర్ రూ.77.91, ముంబైలో  85.33గా ఉంది. కాగా డీజిల్ ధరలు గత కొంతకాలంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మేలో డీజిల్ ధర రూ.69.31గా నమోదైంది. కాగా  గతేడాది జూన్ 15 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రోజువారి సమీక్షా విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

English Title
Diesel price hits record high of Rs 69.46 a litre
Related News