డిజిటల్ మత్తులో యువత

Updated By ManamTue, 06/19/2018 - 10:34
mobile world

imageఈ దశాబ్దపు విధ్వంసపు ఆవిష్కరణ ఏదన్నా అంటే అది స్మార్ట్‌ఫోన్ మాత్రమే. సాంకేతిక సముద్రంలో ఓ రాక్షస తిమింగలంలా అవతరించి రేడియో, కెమెరా, గడియారం, అలారం, టేప్ రికార్డర్ వంటి అనేక చిన్న చిన్న చేపల్ని మింగేసింది. ఇప్పుడిది యువత భవిష్యత్తును కూడా మింగేయటానికి ఎదురు చూస్తోంది. 

ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళబ్బాయికి ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావటంతో, ఓ పేరున్న నక్షత్రాల హోటల్లో డిన్నర్‌కి (రాత్రి భోజనం) నన్ను కూడా ఆహ్వానించారు. ఆ కుర్రవాడ్ని అభినందించినట్టు వుంటుంది కదా అని డిన్నర్‌కి వెళ్ళాను. తీరా హోటల్ రెస్టారెంటులో అడుగుపెట్టానో లేదో, భోజనాల బల్లల దగ్గర దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోవటం నా వైంతెంది. కుర్రాడి తల్లిదండ్రుల దగ్గర్నుంచి, కుర్రాడి స్నేహితులు బంధువులు అంత తమ తమ స్మార్ట్‌ఫోన్లలో మెసేజులు పంపుకుంటూ, వాట్సప్, ఫేస్‌బుక్కుల్లోని సమాచారాన్ని చదువుకుంటూ, యూ ట్యూబ్‌ల్లో వీడియోలను చూస్తు ఎవరికి వారు ఎవ్వరికీ పట్టనట్లు ప్రవర్తిస్తున్నారు.

నా రాకను కాని, నా ఉనికిని గాని గమనించే వాళ్ళు లేరు. ఒక అపరిచిత వ్యక్తిలా, అనామకుడిలా నేను కూడా ఒక టేబుల్ ముందు కూలబడ్డా. వడ్డించేవాడేదో వడ్డించుకుపోతున్నాడు, అసలు ప్లేటు లో ఏముందో కూడా చూసుకోకుండా దృష్టంతా స్మార్ట్‌ఫోన్ తెరైపెనే పెట్టి తినేవాళ్ళు తింటున్నారు. ప్రతి నిమిషం దృష్టంతా స్మార్ట్‌ఫోన్ పైనే పెట్టటం వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండూ దెబ్బతినే ప్రమాదముంది.

ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక చేపట్టిన సర్వే ప్రకారం ఉదయం నిద్రలేవగానే కనీసం పక్కదిగక ముందే తమకేమీ సందేశాలొచ్చాయా అని తమ ఫోన్లను తనిఖీ చేసుకునే వాళ్లు 53 శాతం మంది వుండగా, రాత్రికి నిద్రపోయే ముందు తమ ఫోన్లను తనిఖీ చేసేవారు 76 శాతం మంది వున్నారు. రోజుకు నాలుగు గంటలు పైగా తమ స్మార్ట్‌ఫోన్లతో గడిపేవారు చాలా మంది వున్నారు. 13-18 సంవత్సరాల మధ్య ఉన్న యువత రోజుకు ఎనిమిది గంటలు వీటితో గడుపుతున్నారు. రోజుకు ఏడు గంటలు నిద్ర, ఏడు గంటలు ఉద్యోగం, ఓ రెండు మూడు గంటలు పై పన్లకు పోగా, ఇక మిగిలిన ఖాళీ సమయం ఏడు గంటల్లో సగానికి సగం ఫోన్లతోనే గడిపేస్తున్నారు. నేటి యువత.

‘సాంకేతిక ’ రుగ్మతలు
సాంకేతిక రంగంలో వస్తున్న మార్పుల కనుగుణంగా సమాజంలో ఆందోళనలు, సమస్యలు ఉత్పన్నమవటం ఈ నాలుగే కాదు. డిటెక్టివ్ నవలలు వచ్చినప్పుడు రాత్రిళ్ళు మేల్కొని మరీ చదవటం వల్ల నిద్రలేమితో బాధపడ్డ యువతను చూసాం. టీవీ, రేడియోలు వచ్చినప్పుడు వాటికతుక్కుపోయి ప్రపంచాన్నే మరిచిపోయిన యువతను చూసాం, వీడియోగేములు వచ్చినప్పుడు వాటికి బానిసై అటు డబ్బు, ఇటు ఆరోగ్యం పాడు చేసుకుంటున్న యువతను చూసాం. ఇప్పుడు స్మా ర్టుఫోన్లతోనే కాపురం పెడుతున్న కుటుంబాల దగ్గర నుండి, వాటితోనే జీవిస్తూ, వాటితోనే నడుస్తూ, వాటితోనే నిద్రించే యువతను చూస్తున్నాం. ఈ పరిణామాలకే సమాజంలో మా నవత్వపు విలువలను హరించటానికే దోహద పడుతున్నాయి. ఈ దశాబ్దపు విధ్వంసపు ఆవిష్కరణ ఏదన్నా అంటే అది స్మార్ట్‌ఫోన్ మాత్రమే.

సాంకేతిక సముద్రంలో ఓ రాక్షస తిమింగలంలా అవతరించి రేడియో, కెమెరా, గడియారం, అలారం, టేప్ రికార్డర్ వంటి అనేక చిన్న చిన్న చేపల్ని మింగేసింది. ఇప్పుడిది యువత భవిష్యత్తును కూడా మింగేయటానికి ఎదురు చూస్తోంది. స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడపటం వల్ల యువతలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానో ఉల్లాసం వంటి విక్షీణిస్తూ కేవలం మరబొమ్మల్లా ప్రవర్తిస్తున్నారు. వీటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక యువత ఇందులో లభ్యమౌతున్న ఫేస్‌బుక్, వాట్సఫ్, యూట్యుబ్‌లలో చూడకూడనివి చూస్తూ, నేర్వకూడనివి నేర్చుకొంటున్నారు.

స్మార్ట్ ఫోన్లతో తయారవుతున్న పిరికివాళ్లు
ఈ స్మార్ట్‌ఫోన్ల వల్ల మనిషి పిరికి వారిగా మారిపోతున్నారు. ఫోన్ చేతిలో లేకుండా ఒక్క గంట కూడా గడపలేకపోతున్నాడు. నిరంతరం ఫోన్‌లో తనకేమన్నా కాల్స్ కాని సందేశాలోచ్చినాయోనని తనిఖీ చేసుకోవటమే సరిపోతుంది. ఒక్క క్షణం ఇవి ఆగి ప్రపంచంతో తనకు సంబంధాలు తెగిపోయి వంటరి వాడినై పోయానని ఆందోళన చెందుతున్నాడు. ‘ఐడిసార్డర్’ గ్రంథ రచయిత ‘లార్ రోసన్’ ఇటువంటి వారి గురించి చర్చిస్తూ వీరిని వ్యసనపరులనే కన్నా, పూర్తిగా ఈ స్మార్ట్‌ఫోన్లకు బానిసలుగా అవి వర్ణించవచ్చని పేర్కొన్నాడు.

ఇటువంటి బానిసలకు వేరే ఆలోచన లేమి వుండవు. 24 గం టలూ పరధ్యాన మనస్సుతో స్మార్ట్‌ఫోన్లలోనే గడుపుతుంటా రు. ఇలా గడపటం వల్ల వీరిలో అడ్రినల్ గ్రంథులు, కార్టిసాల్ అనే రసాయునాన్ని అధికంగా శరీరంలో స్రవించటం వల్ల, అ నుక్షణం తమ ఫోన్లను తనిఖీ చేస్తూ, తమకు ఎవరినించన్నా సందేశాలు, వ్యాఖ్యానాలు, ఇష్టాలు వంటివి వచ్చినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనౌతారు.

క్రమేణా ఈ ఉద్వేగాలకు అలవాటుపడి, అటువంటి ఉ ద్వేగాల కోసం మరింతగా ఫోన్లను ఆశ్రయిస్తారు. గుట్కా, సా రా వంటి వ్యసనాలు కూడా ఇదే తరహా ఉద్వేగాన్ని, ఆనందానిస్తాయి.  ఈ స్మార్ట్ ఫోన్ చేతిలోనే వుండటంతో ప్రతిక్షణం దానికి బానిసగా మిగిలిపోతున్నారు. ఇటీవల ఢిల్లీకి చెంది పన్నెం డో తరగతి విద్యార్థి రెండు రోజుల పాటు గదిలోనుం డి బయుటకు రాకుండా ఫో న్‌తోనే గడపటంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది తలుపులు పగలకొట్టాల్సి వ చ్చింది. కేవలం ఫోన్లను వా డే వారే కాదు ఫోన్‌ను సైలెం ట్‌లో పెట్టి తమ దగ్గర పెట్టుకునే వారిలో ఈ ఆందోళన మరింత ఎ క్కువగా వుంటోందని ఓ అధ్యయునంలో తేలింది.

 స్మార్ట్‌ఫోన్లు లేని వారు ‘నో మోబోఫోబియా’ అనే వ్యాధి తో బాధపడుతూ చివరకు ఆత్మహత్యలకు కూడా పాల్పడటానికి వెనుకాడట్లేదు. ఇక సెల్‌ఫోనే వున్న వారిలో హైబిపి, మా నసిక ఆందోళనలు తీవ్ర మానసిక కుంగుబాటు, వంటరి త నాన్ని కోరుకోవటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రపంచంలోనే ఫేస్‌బుక్‌లు, వాట్సాఫ్, యూట్యూబ్‌లలో ఎ క్కువ గడిపే వారు మన దేశపు యువతే. 70 శాతం స్మార్ట్‌ఫోన్ కలిగి వున్న భారతీయుల్లో రోజుకు 200 నిమిషాలు వీటితోనే గడుపుతున్నారు.

అదే అవెురికాలో కేవలం 50 శాతం మందే వీటితో గడుపుతున్నారు. అయితే ఇక భారతీయ యు వతకు అవెురికాలోని యువతకు ఒక స్పష్టైమెన తేడా వుంది. మనదేశంలో స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న యువతలే 30 శాతం మంది వినోదం కోసం, కాలక్షేపం కోసం వీటిని వినియోగిస్తూ తమ కాలాన్ని వృధా చేస్తున్నారు. కాని అవెురికాలో ఇటువంటి వారు కేవలం 18 శాతం మందే యూ ట్యూబ్‌ను వినియోగిస్తుంటే మన దేశంలో 47 శాతం మంది వినియోగిస్తున్నారు.

ఎలక్ట్రానిక్ పరికరాలపై నియంత్రణ
అంతేందుకు ఈ స్మార్ట్ ఫోన్లు, వాట్సఫ్‌లు, ఫేస్‌బుక్‌లను అభివృద్ధి చేసి జనం నెత్తిన రుద్దుతున్న సాంకేతిక దిగ్గజాలు వీటికి చాలా దూరంగా వుంటారంటే ఆశ్చర్యం కలగక మాన దు. బిల్‌గేట్స్, మైక్రోసాఫ్ట్ అధినేత ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతూ గడుపుతారు తప్ప, స్మార్ట్‌ఫోన్ వంక కూడా చూడడు. బిల్‌గేట్స్ పిల్లలకు ఇంట్లో సాధారణ కంప్యూటర్ సదుపాయం కల్పించారు కాని, స్మార్ట్‌ఫోన్లను మాత్రం కొనివ్వలేదు. ఫేస్‌బుక్ నిర్మాత జూకర్ బర్గ్ తన గారాల కూతుర్ని ఆరు బయట ఆటలకు తీసుకెళ్తాడు కాని, మెసంజర్ కిడ్స్‌ని మాత్రం ముట్టనివ్వడు. స్టీవ్ జాబ్స్ తన పిల్లల్ని ఇంటి దగ్గర ఎటువంటి సాంకేతిక పరికరాలు వినియోగించటానికి అవకాశం లేకుండా చేశాడు.


సాంకేతిక పరికరాల ద్వారా ధనవం తులమదామని ఎవైరెతే చూస్తారో, వా రు వారి కుటుంబాలను అదే సాం కేతిక పరికరాల ద్వారా రక్షించుకోవాల్సిన అవసరం ఎక్కువగా వుంటుంది. ఇప్పటికే అవెురికాలోని చాలా పాఠశా లల్లో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని నిషేధించా రు. కాని మనదేశంలో ఇటువంటి చర్యలు తీసుకున్న పాఠశాలలు కానరావు.

ఇప్పుడిప్పుడే సాంకేతిక దిగ్గజాలు కూడా తాము కనుగొన్న ఆవిష్కరణల వల్ల సమాజం ఎంత నష్టపోతుందో అర్థం చేసుకుని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఆపిల్ సంస్థ ఇప్పటికే తన కంపెనీ పరికరాల వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయే అధ్యయనం చేయటం మొదలెట్టింది. ఆం డ్రాయిడ్ సంస్థ ఇప్పుడు కొత్తగా నిర్ణీత సమయానికి మించి ఏ యాప్‌ను వినియోగించినా దానంతటందే ‘లాక్’ అయ్యే విధానాన్ని రూపకల్పన చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో ఎలా మసులు కోవాలో తెలియుచేస్తే పాఠ్యాంశాలు చూడాలి. కనీసం 12వ తరగతి వరకు పాఠశాలల్లో, కళాశాలల్లో వీటి వినియోగాన్ని నిరోధిస్తూ ప్రభుత్వాలు చట్టాలు చేయ్యాలి. ఇటువంటి కఠీన చర్యలు చూపడ్తే తప్ప ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల వలలో పడి బానిసలుగా బతుకుతున్న వారిని మేల్కొల్పలేము.
- ఈదర శ్రీనివాసరెడ్డి
 

English Title
Digital intoxication
Related News