పిల్లలంటే ప్రాణం

Updated By ManamSat, 08/18/2018 - 20:35
Infants Photos, Anoop Puzhamudi Gayathri nayar, Adelaide, Mawson Lakes, Photo Graphy Hobby

Infants Photos, Anup Pulamudi, Gayathri nayar, Adelaide, Mawson Lakes, Photo Graphy Hobbyఅప్పుడే పుట్టిన పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు. పిడికిలి బిగించి, ఒళ్లంతా విరుచుకుంటూ.. రకరకాల హావభావాలు ప్రదర్శిస్తుంటారు. పుట్టిన ఒకటి రెండు రోజుల్లో వాళ్ల ఫొటోలు తీయడం చాలా తక్కువ మందికి ఉండే హాబీ. కేరళకు చెందిన అనూప్ పూళముడి (35).. అలాంటివారిలో ఒకరు. మొట్ట మొదట జమ్ము కశ్మీర్‌లోని మంచుకొండల దగ్గర తన డీఎస్‌ఎల్‌ఆర్ కెవెురాతో నిలబడినప్పుడు తొలిసారి ఫొటోగ్రఫీ అంటే మక్కువ ఏర్పడింది. అప్పటినుంచి దేశంలోని అనేక కొండల అందాలను తన కెమెరా కంటితో బంధిస్తుండేవారు అనూప్. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి తన సొంత రాష్ట్రైమెన కేరళకు వెళ్లినపుడు అక్కడ మూడు నెలల చిన్నారి బోసి నవ్వులతో కనిపించడంతో వెంటనే తన కెవెురాకు పనిచెప్పారు. ఆ ఫొటో ప్రింట్ వేయించి, పాప తల్లిదండ్రులకు ఇచ్చినపుడు వాళ్ల కళ్లలో కనిపించిన ఆనందం చూసి అప్పుడే నిర్ణయించుకున్నారు.. ఆ క్షణం నుంచి చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల ఫొటోలు తీయడాన్ని హాబీగా మొదలుపెట్టారు. స్వతహాగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయినా, తనలోని ఫొటోగ్రఫీ హాబీకి మాత్రం ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ పిల్లల ఫొటోలు తీయడం కొనసాగించారు. ఇప్పుడు అనూప్ పేరు ఇటు ఇండియాతో పాటు ఆస్ట్రేలియాలో కూడా పిల్లల ఫొటోలు, పోర్ట్రయిట్ ఫొటోల విషయంలో మార్మోగిపోతోంది. 

Infants Photos, Anup Pulamudi, Gayathri nayar, Adelaide, Mawson Lakes, Photo Graphy Hobbyఅప్పుడే పుట్టిన పిల్లలను ఫొటో తీయడం చాలా అందమైన కళ అని అనూప్ ‘మనం మకుటం’ ప్రతినిధితో చెప్పారు. అది తన మనసుకు నచ్చిన హాబీ అని.. చిన్న పిల్లల చిన్ని చిన్ని చర్యలను ఫొటోలో బంధించడం, వాళ్ల బుల్లి చేతులు, వాటికుండే బుల్లి బుల్లి వేళ్లు ముడుచుకుని పిడికిలి బిగించడం, చిన్న కళ్లలో మెరుపులా కనిపించే ఆసక్తి, చుట్టుపక్కల ఏముందో.. ఎవరున్నారో తెలుసుకోవాలనే ఆతృత.. ఇన్ని భావాలు అంత చిన్న పిల్లల్లో కనిపించడం, వాటన్నింటినీ ఫొటోలలో బంధించడం చాలా కష్టంతో కూడుకున్న ఇష్టమైన పని అని అనూప్ వివరించారు. వృత్తిరీత్యా ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి వచ్చినా, అక్కడా తన కెవెురాను మాత్రం వదిలిపెట్టలేదు. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు అలా చూస్తూ ఉండిపోతే ఎన్ని యుగాైలెనా గడిచిపోతాయని, ఆ అమాయకత్వాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడమే తన ఫొటోల లక్ష్యమని చెప్పారు. 

అయితే.. చంటి పిల్లలను ఫొటో తీయడం మాత్రం అంత సులభం ఏమీ కాదు. పెద్దవాళ్లయితే ఎప్పుడు ఏం చేస్తారో ఊహించవచ్చనీ, వాళ్లనెలా తీయాలంటే అలా తీయొచ్చనీ, కానీ చంటి పిల్లలు ఏ క్షణంలో ఎలా ఉంటారో అస్సలు చెప్పలేమనీ అన్నారు. మంచి ఫొటో కావాలంటే పాప నిద్రపోతుండాలనీ, అప్పుడే చకచకా దుస్తులు మార్చి, కావాల్సిన సహజైమెన కాంతి వచ్చే ప్రదేశంలో వారిని పడుకోబెట్టి ఫొటోలు తీసుకోవడం వీలవుతుందనీ అన్నారు. 

Infants Photos, Anup Pulamudi, Gayathri nayar, Adelaide, Mawson Lakes, Photo Graphy Hobby‘‘కానీ, అన్నిసార్లూ మనం అనుకున్నట్లు జరగదు. వాళ్లు ఒక్కోసారి భయపడతారు.. ఒకోసారి బోర్లా పడతారు, మరోసారి ముఖాలకు చేతులు అడ్డంగా పెట్టుకుంటారు. మనకు కావల్సినట్లుగా వాళ్లను బలవంతంగా ఉంచలేం. అలాంటి సందర్భాల్లో పిల్లల చుట్టూ ఉండే వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చేయాలి. వారి నవ్వులు పట్టుకోవాలి. అంత చేసినా మంచి ఫొటో వస్తుందన్న గ్యారంటీ లేదు. అది మన అదృష్టం మీద ఆధారపడుతుంది’’ అని ఆయన వివరించారు. చాలా ప్రయత్నించినా రాని ఫొటోలు ఒక్కోసారి అనుకోకుండా వచ్చేస్తాయనీ, ఏదేమైనా చివరకు వాళ్ల తల్లిదండ్రులు జీవితాంతం గుర్తుపెట్టుకునే ఫొటో ఇవ్వాలన్నదే తమ తాపత్రయమనీ చెబుతారు అనూప్. తాను తీసిన చిన్న పిల్లల ఫొటోలతో టైనీటేక్స్.కామ్ అనే వెబ్‌సైట్ కూడా పెట్టారు. అయితే, ఆయన ఫొటోగ్రాఫరే కానీ వ్యాపారవేత్త కాదు. దాంతో మొదట్లో తెలియక చాలామంది కస్టమర్లను పోగొట్టుకొన్నారు. రోజులు మారాయి. ఇప్పుడు ఆయనకు చాలా కాల్స్ వస్తున్నాయి. 

అయితే ఒకైవెపు ఒత్తిడితో కూడిన ఉద్యోగం, మరోవైపు ఫొటోగ్రఫీ.. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం ఆయన చాలా కష్టంగా ఉంటోంది. అయితే తమ పిల్లల ఫొటోలు చూసుకున్నపుడు తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించే ఆనందానికి మాత్రం వెలకట్టలేమని చెమర్చిన కళ్లతో చెప్పారు అనూప్. ‘‘కొంతమంది ఆ ఫొటోలు చూసి కళ్లనీళ్లు పెట్టుకుంటారు. మరికొందరు నవ్వు ఆపుకోలేరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం చూసినపుడు మాత్రం నాకు గాల్లో ఎగిరినట్లు ఉంటుంది’’ అన్నారాయన. కొత్తగా పిల్లల ఫొటోలు తీయాలనుకునేవారికి కొన్ని సలహాలు కూడా అనూప్ ఇచ్చారు. క్లయింట్లను బాగా చూసుకుని, సమయానికి వెళ్లాలన్నారు.

Anoop Puzhamudi అలాగే కొందరు తల్లిదండ్రులు కూడా ఫొటోలంటే భయపడతారనీ, వాళ్ల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత మనదేననీ వివరించారు. ‘‘పిల్లల దుస్తులు మార్చడానికి, వాళ్ల సంరక్షణకు ప్రత్యేకంగా సౌకర్యవంతంగా ఉండే గది ఏర్పాటుచేయాలి. వాళ్లకు అవసరైమెన పాలు, ఇతర వస్తువులు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న పనులతో పిల్లల తల్లిదండ్రులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి’’ అని ఆయన చెప్పారు. 
అనూప్.. ఫొటోగ్రఫీ వెబ్‌సైట్.. www.portraitsbyanoop.com.au  
(అడిలైడ్ నుంచి గాయత్రీ నాయర్)

English Title
Digital Photography on Portraits Photos by Anoop Puzhamudi
Related News