స్క్రిప్ట్‌ను నమ్మే నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు 

Updated By ManamTue, 10/23/2018 - 03:23
hello guru

imageరామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. త్రినాథరావు నక్కిన దర్శకుడు. శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్ ఇప్పుడు హలో గురు ప్రేమ కోసమే.. మూడు సినిమాలు.. మూడు విజయాలు. ఓ డైరెక్టర్‌గా ఇంత కంటే ఏం కావాలి..చాలా హ్యాపీగా ఉంది. ప్రకాశ్‌రాజ్‌గారు, దేవిశ్రీ ప్రసాద్‌గారు, దిల్‌రాజుగారు, శిరీష్, లక్ష్మణ్‌గారు, సాయికృష్ణ, ప్రసన్న, సాహి సురేశ్ ఇలా అందరికీ థాంక్స్’’ అన్నారు.

అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘‘సినిమా గురించి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. రామ్, త్రినాథరావు, దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు సహా అందరికీ థాంక్స్’’ అన్నారు. హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘సాయికృష్ణ, ప్రసన్న, త్రినాథరావు సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. హ్యాట్రిక్ హిట్ సాధించేశారు. మంచి టీమ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. హీరో రామ్ మాట్లాడుతూ ‘‘దేవిశ్రీ ప్రసాద్‌తో నేను చేసిన ఆరో సినిమా ఇది. అనుపమ అద్భుతమైన నటి. త్రినాథ్‌రావుగారు.. చాలా  ఎంటర్‌టైనింగ్ డైరెక్టర్. ఆయన ముందు ఆడియన్. తర్వాతే డైరెక్టర్’’ అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘స్క్రిప్ట్‌ను నమ్మి సినిమాలు చేసే అతి తక్కువ మంది నిర్మాతల్లో రాజుగారు ఒకరు. అలాంటి నిర్మాత ఎంచుకున్న దర్శకుడు త్రినాథరావు. ఇతను రామ్‌ను చాలా బ్యాలెన్డ్‌గా చేయించారు. తను స్వచ్ఛత ఉన్న మనిషి. తన సినిమాలు సరదా సరదాగా ఉంటాయి. ఈ సినిమాను సెటిల్డ్‌గా చేయించారు. హర్షిత్.. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాకు నా దగ్గర పనిచేశాడు. తనకు మంచి భవిష్యత్ ఉంది. అలాగే శిరీశ్, లక్ష్మణ్‌లకు అభినందనలు. యూనిట్‌కు కంగ్రాట్స్’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 

English Title
Dilraju is one of the producers who believes in script
Related News