హరికృష్ణ అరుదైన ఫొటో.. నాన్న ముందు రథసారధి

Updated By ManamWed, 08/29/2018 - 15:14
Harikrishna

Harikrishnaనల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు హరికృష్ణ కన్నుమూశారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులను ఆయన మరణంపై సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు క్రిష్.. ఓ అరుదైన ఫొటోను షేర్ చేసుకున్నారు.

అది హరికృష్ణ చిన్న వయసుకు సంబంధించింది కాగా.. అందులో ఎన్టీఆర్ ముందు నడుస్తున్నారు. 1962లో దేశ రక్షణ కోసం ఎన్టీఆర్ విరాళాలు సేకరిస్తున్న సందర్భంలో ఈ ఫొటోనే తీశారు. దీన్ని షేర్ చేసిన క్రిష్.. ‘‘మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథ సారధి.. చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం’’ అంటూ పేర్కొన్నారు.

English Title
Director Krish shared rare photo of Harikrishna
Related News