జగన్‌ను కలిసిన దర్శకుడు కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి

Updated By ManamWed, 09/26/2018 - 12:27
Jagan Mohan Reddy, Krishna Reddy, Atchi Reddy

Jagan Mohan Reddy, Krishna Reddy, Atchi Reddyవిజయనగరం: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న జగన్ పాదయాత్ర బుధవారానికి 271వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఆయన విజయనగరంలో పర్యటిస్తుండగా.. టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జగన్‌తో కాసేపు ముచ్చటించిన ఈ ఇద్దరు పాదయాత్రకు తమ సంఘీభావం ప్రకటించారు. కాగా గతేడాది నవంబర్‌లో పాదయాత్రను ప్రారంభించిన జగన్.. దేశపాత్రునిపాలెం వద్ద సోమవారం మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటిని విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ పైలాన్‌తో పాటు రావి చెట్టును నాటారు జగన్.

English Title
Director Krishna Reddy, Producer Atchi Reddy met YS jagan Mohan Reddy
Related News