రాష్ట్రంలో విద్యారంగం నిర్వీర్యం

Updated By ManamWed, 03/21/2018 - 01:13
kishan reddy

సర్కారు విధానాలే కారణం: కిషన్ రెడ్డి

kishan reddyహైదరాబాద్: ఉపాధ్యాయ, ఆచార్య ఖాళీల భర్తీ చేయకుండా తెలంగాణ సర్కారు విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్‌లో విద్యారంగానికి తగు కేటాయింపులు జరగలేదని పేర్కొన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టలేదని విమర్శించారు. విద్యారంగానికి సంబంధించి పలు అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా, నిర్మాణాత్మక సూచనలు చేసినా సర్కారు పట్టించుకో లేదని వివరించారు. మంగళవారం అసెంబ్లీ, మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ స్కూళ్లకు అనుమతులిస్తున్నారు కానీ ప్రభుత్వం ఫీజు నియంత్రించడంలేదని, అధిక ఫీజుల వల్ల మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలోనూ ప్రభుత్వం దాటవేత ధోరణితో ఉందన్నారు. టీఆర్‌ఎస్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పుచేస్తే ఎత్తిచూపే బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నా రు. టీఆర్‌ఎస్ సర్కారు మాటలు కోటలు దాటుతున్నా.. అభివృద్ధి పనులు ప్రగతి భవన్ దాటట్లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రజల్లోకి వెళ్లి నిలదీస్తామన్నారు.

English Title
Dispose of education in the state
Related News