వరల్డ్ చాంపియన్‌షిప్‌కు చాను దూరం

Updated By ManamWed, 09/19/2018 - 00:14
chanu
  • సతీష్ శివలింగం, రాగాల వెంకట్ కూడా  

imageన్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్ మీరా బాయి చాను, సతీస్ శివలింగం, రాగాల వెంకట్ రాహుల్ ఈ ఏడాది జరగబోయే వరల్డ్ చాంపి యన్‌షిప్‌కు దూరమ య్యారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే పది టోర్నీల్లో వరల్డ్ చాంపియన్‌షిప్ కూడా ఒకటి. ‘ ఏప్రిల్‌లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి సీనియర్ వెయిట్ లిఫ్టర్ల్‌కు విశ్రాంతి లభించలేదు. కామన్‌వెల్త్ గేమ్స్ తరువాత వారు పున రావాస శిబిరాన్నికి రావాల్సి ఉంది. కానీ అది ప్రణాళిక ప్రకారం జరగలేదు’ అని నేషనల్ కోచ్ విజయ్ శర్మ తెలిపారు. ‘వెన్నెముక గాయం మళ్లీ మొదలైందని ఎక్కు వ బరువు పట్టకూడదని వైద్యులు సూచించారు. లైట్ వెయిట్ ట్రెనింగ్ తీసు కుంటున్నాను’ అని మీరాబాయి తెలిపింది. ప్రస్తుతం చాను ముంబైలో ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. 

English Title
distance to the World Championship
Related News