చైతూ, సమంత మధ్యలో ఆమె..?

Updated By ManamThu, 07/19/2018 - 12:11
chai, sam

divyanshaఅక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత క‌లిసి జంట‌గా ఓ సినిమాలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. `నిన్నుకోరి` ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ద నిర్మిస్తున్నారు. ఆగ‌స్టులో ప్రారంభం కానున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ న‌టి న‌టించ‌నున్నారు. హిందీ సీరియ‌ల్స్‌, యాడ్స్‌లో న‌టించిన దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. భార్య భ‌ర్త‌ల మ‌ధ్య దివ్యాంశ క్యారెక్ట‌ర్ ఎంట్రీతో మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌స్తాయ‌ట‌. చివ‌ర‌కు స‌మ‌స్య ఎలా ప‌రిష్కార‌మైంద‌నేదే క‌థాంశం. ఈ సినిమాలో దివ్యాంశ్ సెప్టెంబ‌ర్ నుండి భాగ‌మ‌వుతారట‌. 

English Title
Divyansha Kaushik between Naga Chaitanya, Samantha
Related News