తిరుమల వెంకన్నను ఇంత మాట అనేశారేంటి?

Updated By ManamWed, 01/10/2018 - 19:14
kanimozhi

kanimozhiచెన్నై: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడిపై కరుణానిధి కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల బాలాజీ కోట్లు ఇచ్చేవారికే దేవుడని ఆమె వ్యాఖ్యానించారు. పేదవారిని కాపాడలేని దేవుడు ఎందుకని కనిమొళి ప్రశ్నించారు. హుండీని కాపాడుకోలేని వాడు భక్తులను ఎలా కాపాడతాడని కనిమొళి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అంతేకాదు, డబ్బు లేనివారికి దైవ దర్శనానికి రోజుల పాటు పడిగాపులు తప్పవని ఆమె చెప్పారు. కోట్లాది రూపాయలిచ్చే వారికే ఆయన దేవుడంటూ కనిమొళి వ్యాఖ్యానించడం గమనార్హం. కనిమొళి వ్యాఖ్యలపై తిరుమల వెంకన్న భక్తులు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు కనిమొళి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

English Title
dmk mp kanimozhi comments on tirumala temple
Related News