రాష్ట్రంలో కంటి జబ్బులుండొద్దు

Updated By ManamFri, 08/03/2018 - 01:10
kadiyam srihar
  • కంటి వెలుగుపై సమీక్షలో కడియం

kadiyamవరంగల్: కంటి జబ్బులు లేని రాష్ట్రంగా తెలంగాణణు తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకు ఈ నెల 15 నుంచి చేపట్టబోయే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిజేయాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో భేటీ అయిన మంత్రి, కంటి వెలుగు, హరితహారం, రైతు బీమా కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. గ్రామాల్లో రోజుకు 250, పట్టణాల్లో 300ల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని ఇందుకు అవసరమయ్యే రూ.51.71 కోట్ల నిధులను కూడా విడుదల చేశామని వివరించారు. జనాభాకు అనుగుణంగా రాష్ట్రంలోని 31 జిల్లాలకు ఈ నిధులను కేటాయించామని తెలిపారు. ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైతే ఆపరేషన్ చేయాలని, అద్దాలు పంపిణీ చేయాలని సూచించారు. 15న కార్యక్రమ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనేక పథకాలు ఏకకాలంలో చేపడుతున్నందున అధికారులపై పని ఒత్తిడి పెరిగినా, ప్రజా సంక్షేమం దృష్ట్యా సహనంతో పన్జేయాలన్నారు. రాష్ట్రంలో 799 ఫీల్డ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, అర్బన్ జిల్లాలో 19, రూరల్ జిల్లాలో 24 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

English Title
Do not have eye contact in the state
Related News