వినియోగదార్లపై లేదు కలత... కాసులైపెనే మనసంతా

Updated By ManamMon, 02/12/2018 - 22:20
pol

polన్యూఢిల్లీ: కేంద్రం పెట్రోలు, డీజిలుపై లెవీల ద్వారా 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో రూ. 10 లక్షల కోట్లకు పైగా గడించనున్నట్లు అంచనా. ఎక్సైజ్  సుంకాలలో పెంపుదలతో కూడా కలుపుకుని పెట్రోలియం ఉత్పత్తుల నుంచి కేంద్ర స్థూల రెవిన్యూ వసూళ్ళు 2014-15లో ఉన్న రూ. 1.05 లక్షల కోట్ల నుంచి ఈ ఐదేళ్ళలో స్థిరంగా పెరుగుతూ వచ్చాయని, అవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 2.57 లక్షల కోట్ల మేరకు ఉండగలవని అధికారిక డాటా వెల్లడిస్తోంది. దీనికి ముందు, 2013-14లో, పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్ల (పి.ఓ.ఎల్) నుంచి స్థూల రెవిన్యూ వసూళ్ళు రూ. 88,600 కోట్ల మేరకు ఉన్నాయి. పి.ఓ.ఎల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం నుంచి రెవిన్యూ నిధులకు గణనీయమైన వనరుగా ఉందని, ద్రవ్య లోటును అదుపులో ఉంచడానికి సహాయపడడవేుకాక, ఉత్పాదక వ్యయాన్ని పెంచడానికి కూడా తోడ్పడుతూ వచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు సమయం వచ్చినప్పుడల్లా చెబుతూ వస్తున్నారు. ‘‘ఇంధనంపై సుంకాలు కేంద్రానికి, రాష్ట్రాలకు రెండింటికీ కూడా రెవిన్యూకి పెద్ద వనరుగా ఉంటూ, వ్యయాలకు నిధులు సమకూర్చేందుకు సహాయపడుతున్నాయి’’ అని ఒక అధికారి చెప్పారు. పెట్రోలు, డీజిలుపై రాష్ట్రాలు కూడా వాల్యూ యాడెడ్ ట్యాక్స్‌ను విధిస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవలి బడ్జెట్‌లో, లీటరు పెట్రోలుపై 8 రూపాయల చొప్పున రోడ్డు, మౌలిక వసతుల సెస్సు విధించారు. అది రూ. 1,13,000 కోట్ల మేరకు రాబడి తెచ్చిపెట్టగలదని అంచనా. దీనికి ప్రతిగా, ఆయన లీటరు పెట్రోలుపై అదనపు ఎక్సైజ్ సుంకంగా ఉన్న 6 రూపాయలను ఉపసంహరించుకున్నారు. ప్రాథమిక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 2 రూపాయల చొప్పున తగ్గించుకున్నారు. 

అయితే, ఇలా రేట్లను మార్చి సెస్సు విధించడం వల్ల రిటైల్ వినియోగదార్లకు ధరల్లో కనిపించగల ప్రభావం ఏమీ ఉండదని ఆర్థిక శాఖ కార్యదర్శి హాస్‌ముఖ్ అధియా అన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉండడాన్ని ఆసరా చేసుకుని, 2014 నవంబరు నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ వరుసగా అనేక విడతల్లో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అన్ బ్రాండెడ్ పెట్రోలుపై కేంద్ర ఎక్సైజ్ సుంకం 2014 నవంబరులో లీటరుకు రూ. 9.20గా ఉన్నది, 2017 జూలైలో అత్యధికంగా రూ. 21.48కి చేరుకుని, ప్రస్తుతం లీటరుకు రూ. 19.48గా ఉంది. అదే మాదిరిగా, అన్‌బ్రాండెట్ డీజిలుపై కేంద్ర ఎక్సైజ్ సుంకం (2014 నవంబరు) లీటరుకు రూ. 3.46గా ఉన్నది, ప్రస్తుతం లీటరుకు రూ. 15.33కు చేరుకుంది. ఇటీవలి నెలల్లో, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతూండడంతో, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకుని, రిటైల్ ధరలు తగ్గేట్లు చూడవలసిందిగా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. దానికి తగ్గట్లుగానే, ఆర్థిక మంత్రిత్వ శాఖ 2017 అక్టోబరు 4న లీటరుకు ఉన్న సుంకాల్లో రూ. 2 తగ్గించింది. ఆర్థిక సంవత్సరం మిగిలిన భాగంలో దానివల్ల రాబడిలో రూ. 13,000 కోట్ల మేల లోటు ఏర్పడగలదని అంచనా వేశారు. ‘‘వినియోగదారులకు మరింత ఊరట కలిగించేందుకు పెట్రోలు, డీజిలుపై విధించిన ‘వ్యాట్’ను తగ్గించుకోవలసిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అభ్యర్థించింది. పెట్రోలు, డీజిలుపై ‘వ్యాట్’ను నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం తగ్గించుకున్నాయి’’ అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా ఇటీవల లోక్ సభకు తెలిపారు. కానీ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మరింత పెరిగినా, ప్రభుత్వం ఎక్సైజ్ సుంక రేట్లను తగ్గించే నిర్ణయం ఏదీ తీసుకోలేదు.  

Tags
English Title
Do not worry about customers ...
Related News