ఉత్తరాది ముష్టి మనకు అవసరమా ?

Updated By ManamSun, 02/11/2018 - 01:05
photo

photoనీకు పిచ్చి పట్టిందా.. పో... నీ సీటులోకి పో! మీకే క్రమశిక్షణ లేకపోతే ఇక మీ పిల్లలకేం నేర్పిస్తారు?
ఆమెను నవ్వనివ్వండి.. చాలా రోజుల తర్వాత శూర్పణఖ నవ్వు చూసే భాగ్యం కలిగింది!! ఆమెకు బాగా పొగరు పట్టింది.. ఇలాంటివాళ్లు పార్టీలో ఉంటే కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది!!

గౌరవనీయులైన ఎంపీలను ఉద్దేశించి కొంతమంది పెద్దలు చేసిన వ్యాఖ్యలివి. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడమే వాళ్లు చేసుకున్న పాపం. అదే ఉత్తరాది రాష్ట్రాల వాళ్ల గురించి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే ఒక్కసారిగా అల్లకల్లోలం రేగేది. సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు వెల్లువెత్తేవి. ఒకరి తర్వాత ఒకరుగా పార్టీల అధినాయకులు కూడా స్పందించేవాళ్లు. కానీ, దక్షిణాది రాష్ట్రాలు కావడం.. అందునా రెండుగా విడిపోయిన తెలుగురాష్ట్రాలు కావడంతో వీళ్లను ఏమన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరులే అన్న అహంకారం అడుగడుగునా కనిపిస్తోంది. దక్షిణాది వాళ్లంటే ముందు నుంచి ఉత్తరాది రాష్ట్రాల వాళ్లకు ఉన్న చిన్నచూపు మరోసారి బట్టబయలైంది. అందుకే సోషల్ మీడియాలో పదే పదే.. ఉత్తరాది, దక్షిణాది రెండు దేశాలుగా విడిపోయినా తప్పులేదనే వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చిట్టచివరిసారిగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో మంటలు రేపింది. ఇప్పటివరకు పోనీలే.. ఎంతైనా మిత్ర పక్షం కదా అని అణిచిపెట్టుకున్న తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇంతోటి మీతో పొత్తు ఉంటే ఎంత.. ఊడితే ఎంతని నిర్ణయించేసుకున్నట్లే కనపడుతోంది. మాటలు కోటలు దాటుతాయి గానీ చేతలు గుమ్మం కూడా దాటవన్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన మంత్రి వర్గ సహచరుల చేష్టలు కనిపిస్తున్నాయి.

ఎన్నికలుంటేనే దక్షిణాది గుర్తుకొచ్చేది
 విభజన ఫలితంగా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావల్సిన కనీస మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఎంగిలి మెతుకులు కూడా విదల్చడం లేదు. ఒక కొత్త రాజధాని నిర్మాణం కావాలంటే ఏడాదికి 500 కోట్ల రూపాయల చొప్పున ముష్టి వేస్తే ఏ మూలకు సరిపోతుంది? పూర్తిగా ఒక కొత్త నగరాన్ని రూపొందించడంతో పాటు అందులో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, వివిధ శాఖలకు సంబంధించిన భవనాలు, యూనివర్సిటీలు, జాతీయస్థాయి విద్యాసంస్థలు, వాటన్నిం టికీ భవనాలు, హాస్టళ్లు.. ఇన్ని నిర్మాణాలు చేయాల్సి ఉందన్న విషయం తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం అసలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది ఇప్పటికీ భేతాళ ప్రశ్నగానే మిగిలిపోతోంది. హైకోర్టును విభజించండి మహాప్రభో అంటూ రెండు తెలుగు రాష్ట్రాలు గొంతు చించుకుని ఇప్పటికి లెక్కలేనన్నిసార్లు అడిగినా దాని ప్రస్తావన కూడా సరిగా చేయడం లేదు. ప్రతిసారీ ఎన్నికలే లక్ష్యంగా రాబోయే సంవత్సరంలో ఎన్నికలున్న రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ మిగిలినవాటిపై సవతిప్రేమ చూపిస్తూ వస్తున్న ఎన్డ్డీయే సర్కారు.. మరోసారి కూడా అదే బుద్ధి చూపించుకుంది. కర్ణాటక, మహారాష్ట్రలలో త్వరలో ఎన్నికలుండటం, ఆ రెండుచోట్ల అధికారంలోకి వచ్చేందుకు కొంతవరకు అవకాశాలు కనిపిస్తుండటంతో అక్కడి ప్రజలకు బిస్కట్లు వేసి నట్లు మెట్రోరైలుకు కోట్లాది రూపాయలు కుమ్మరించింది. అదే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం అత్యంత అవసరమైన విజయవాడ మెట్రోరైలు గురించి అసలు ప్రస్తావనే లేకుండా పూర్తిగా విస్మరించింది. ఆ విషయం గురించి అడిగితే డీపీఆర్ పంపలేదని వంక పెడుతున్నారు. ప్రాజెక్టు నిధుల కేటాయింపునకు, డీపీఆర్‌కు సంబంధం ఏంటో అర్థంకాదు. డీపీఆర్ లేనంత మాత్రాన సుమారుగా ఎంత ఖర్చవుతుందో ఆ మాత్రం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అంచనా ఉండదా? ఇవ్వాలనుకుంటే దాని ప్రతిపాదనను బడ్జెట్‌లో పెట్టలేరా? కావాలనుకుంటే డీపీఆర్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా నిధుల విడుదలలో మార్పు చేర్పులు చేసుకోవచ్చు. అసలు ఆ మాటకొస్తే పార్లమెంటులో ఆమోదం పొందిన బడ్జెట్‌ను యథాతథంగా అమలుచేసిన సందర్భాలు ఇప్పటికి ఎన్ని ఉన్నట్లు? తప్పనిసరిగా క్షేత్ర స్థాయి అవసరాలను బట్టి అందులో మార్పుచేర్పులు ఉంటాయి. 

దక్షిణాది వాళ్లంటే ముందు నుంచి ఉత్తరాది రాష్ట్రాల వాళ్లకు ఉన్న చిన్నచూపు మరోసారి బట్టబయలైంది. అందుకే సోషల్ మీడియాలో పదే పదే.. ఉత్తరాది, దక్షిణాది రెండు దేశాలుగా విడిపోయినా తప్పులేదనే వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చిట్టచివరిసారిగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో మంటలు రేపింది. ఇప్పటివరకు పోనీలే.. ఎంతైనా మిత్ర పక్షం కదా అని అణిచిపెట్టుకున్న తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇంతోటి మీతో పొత్తు ఉంటే ఎంత.. ఊడితే ఎంతని నిర్ణయించేసుకున్నట్లే కనపడుతోంది. మాటలు కోటలు దాటుతాయి గానీ చేతలు గుమ్మం కూడా దాటవన్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన మంత్రి వర్గ సహచరుల చేష్టలు కనిపిస్తున్నాయి. విభజన ఫలితంగా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావల్సిన కనీస మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఎంగిలి మెతుకులు కూడా విదల్చడం లేదు. ఒక కొత్త రాజధాని నిర్మాణం కావాలంటే ఏడాదికి 500 కోట్ల రూపాయల చొప్పున ముష్టి వేస్తే ఏ మూలకు సరిపోతుంది? 

అన్నీ మాటల్లోనే ...
ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేశామని.. మిగి లిన ఒకటి, అరా ఉంటే అవి కూడా ఇచ్చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన వాక్చాతుర్యంతో అందరినీ నమ్మించడానికి ప్రయత్నించారు. వాళ్లు ఇచ్చేశామని చెబు తున్న వాటిలో మచ్చుకు ఒకదాని గురించి మాట్లాడు కుందాం. ఏపీ ఎన్‌ఐటీ అంటూ తాడేపల్లిగూడేనికి ఇచ్చామని చెబుతున్నారు. అక్కడ ఇప్పటికే పాఠాలు చెబుతున్నామని కూడా అంటున్నారు. కానీ, అక్కడకు ఒక్కసారి వెళ్లి చూస్తే వాస్తవం ఏంటో తెలుస్తుంది. ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజి వాళ్లు వేసిన ముష్టితో ఆ ఎన్‌ఐటీ నడుస్తోంది. సదరు కాలేజివాళ్లు పోనీలే అని తమ భవనాలతో పాటు అదనంగా మరికొన్ని కూడా కట్టించి అందులో ఎన్‌ఐటీ క్లాసులు నడుపుకోడానికి అనుమతి ఇచ్చారు. హాస్టల్ వసతి విషయా నికొస్తే మగపిల్లలకు అక్కడుంది గానీ ఆడపిల్లలకు వేరే చోట ప్రైవేటు భవనంలో వసతి ఇవ్వాల్సి వచ్చింది. ఇంతవరకు తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీకి కేటాయించిన స్థలానికి ప్రహరీ గోడ నిర్మాణానికి కావల్సిన నిధులు కూడా కేంద్రం నుంచి మంజూరు కాలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కేంద్రం ఇచ్చేశామని చెబుతున్న జాతీయస్థాయి విద్యా సంస్థల పరిస్థితి ఇంత అందంగా ఉంది. రేపోమాపో ఇక మా భవనాలు మాకు కావాలి.. మీరు వెళ్లండి అని ఆ ఇంజినీరింగ్ కాలేజివాళ్లు చెబితే ఇక విద్యార్థులంతా రోడ్డు మీద పడాల్సిందే. దానికితోడు పూర్తిస్థాయి ఫ్యాకల్టీ కూడా అక్కడ లేదు. వరంగల్‌లో ఉన్న ఎన్‌ఐటీ నుంచి కొంతమంది ఫ్యాకల్టీ వారాంతాల్లో వచ్చి అక్కడ పాఠాలు చెప్పి వెళ్తుం టారు. అందుకోసం దేశం మొత్తమ్మీద ఆ ఒక్క ఎన్‌ఐటీలో మాత్రమే శని, ఆదివారాలు కూడా పనిదినాలు అవుతున్నాయి. మిగిలిన సంస్థల సం‘గతీ’ అలాగే తగలబడింది.


తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన ఎన్డీయే పెద్దలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఊసే ఎత్తలేదు. ఏళ్ల తరబడి ప్రతిపక్షం విపరీతంగా ఉద్యమాలు చేయడంతో ఏదో ఒకటి చేయండని ఏపీ ప్రభుత్వం అడిగిన మీదట.. ఒకరోజు అర్ధరాత్రి ఉన్నట్టుండి జైట్లీ తాము రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని.. అందువల్ల ప్రత్యేక ప్యాకేజి ఇస్తా మని ప్రకటించారు. ఈ ప్యాకేజి ద్వారా అదనంగా నిధులు ఇస్తామని ఊదరగొట్టారు. పోనీ, ఆ పారేసే ముష్టి ఏదో పారేస్తే దాంతోనైనా కాస్త మేలు జరుగుతుందనుకుంటే.. అందులోనూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రాష్ట్ర కొత్త రాజధాని నగరంలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తరహా ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పినా, ఈ ఐదు బడ్జెట్లలో దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మరి ఇంకా ఎయిమ్స్ ఎప్పుడు పెడతారో, దానికి నిధులు ఎక్కడి నుంచి తేవాలో కేంద్రమే చెప్పాలి. 

తెలంగాణ పరిస్థితీ అంతే!
ఇటు తెలంగాణకు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఒరగబెట్టింది ఏమీ లేదు. పసుపుబోర్డు కేటాయించాలని ఎంపీ కవిత దగ్గర నుంచి చాలామంది చాలాసార్లు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నా.. అవన్నీ బధిర శంఖారావాలే అయ్యాయి తప్ప ప్రయోజనం కనిపించలేదు. ఇక రైతులకు మేలుచేసే బడ్జెట్ అని ఘనంగా చెప్పు కొంటున్నా.. ఎరువుల సబ్సిడీలను నేరుగా రైతులకు కాకుండా ఎరువుల కంపెనీలకు ఇవ్వడం వల్ల రైతులకు పైసా ప్రయోజనం కూడా రావట్లేదు. ఆ విషయాన్నీ పట్టించుకో లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ సంస్థలను తెలంగాణలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర మంత్రులు కోరినా, అటునుంచి స్పందన మాత్రం లేదు. సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని, వాటికి నిధులివ్వాలని కోరితే సమా దానం లేదు. రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, దానికి సంబంధించి కొంత సాయం చేయాలని అడిగితే పట్టించుకునే తీరిక కేంద్ర పెద్దలకు లేదు. జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆదాయానికి గండిపెట్టి.. ఆ తర్వాత చేయాల్సిన సాయం మాత్రం చేయకుండా వదిలేయడం వల్ల తెలుగు రాష్ట్రాలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ఉనికి లేదనే తెలుగురాష్ట్రాలపై చిన్నచూపు
వచ్చే సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో కూడా జమిలి ఎన్నికలే ఉన్నాయి. అసెంబ్లీలకు, లోక్‌సభా స్థానాలకు కలిపి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. కానీ, ఈ రెండు రాష్ట్రాలలో తమకు పెద్దగా బలం పెరిగే అవకాశం లేదని కమల నాథులకు స్పష్టంగా తెలుసు. అందుకేనేమో.. ఈ రాష్ట్రాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా అలా వదిలేశారు. పార్లమెంటు సాక్షిగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నిలువునా పట్టుకుని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను కడిగి పారేసినా.. ఆ సమయానికి సభలో ప్రధానమంత్రి సహా ముఖ్యమైన మంత్రులెవరూ లేకపోవడం, సభాపతి స్థానంలో కూడా స్పీకర్ బదులు ప్యానల్ స్పీకర్ మాత్రమే ఉండటంతో ఆయనది అరణ్యరోదనగానే మిగిలిపోయింది. ఒకవైపు జయదేవ్, మరోవైపు కవిత సంధించిన ప్రశ్నలకు కేంద్ర పెద్దల వద్ద సమాధానం ఉంటే ఒట్టు. నాలుగేళ్ల నుంచి పదే పదే అడుగుతున్నా బీజేపీ పెద్దలకు దక్షిణాది రాష్ట్రాలు.. అందునా తెలుగు రాష్ట్రాలంటే ఎందుకు పట్టింపు ఉండట్లేదు? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నట్లుగా.. ఈ రాష్ట్రాలు రెండూ దేశంలో భాగం కావని ఏమైనా అనుకుంటున్నారా? అలాంటి ఉద్దేశమే ఉంటే నేరుగా ముఖం మీద కుండబద్దలుకొట్టినట్లు చెప్పేయాలి. ఎవరిచావు వాళ్లు చస్తారు. ఓట్లు అడుక్కోడానికి మాత్రం పనికొచ్చే ప్రజలు.. నిధులు, ప్రాజెక్టుల విషయంలో పనికిరారని వాళ్లు అనుకుంటే వాళ్లు మనకూ అక్కర్లేదు. ఆ ఊరికి ఈ ఊరు ఎంతదూరమో, ఈ ఊరికి ఆ ఊరూ అంతే దూరమన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు.. ముఖ్యంగా ఉత్తరాది నాయకులు గుర్తుంచుకోవాలి. ఐటీ పరిశ్రమలో దూసుకుపోతున్నది అంతా దక్షిణాది నగరాలే. ఉత్తరాదిలో ఏదో ఒకటి రెండు మినహా మిగిలిన రాష్ట్రాలలో అసలు ఐటీ జాడే లేదు. 

ఉత్తరాది ఎంగిలి వెుతుకులు అవసరమా? 
అలాగే విశాఖపట్నం, చెన్నై లాంటి ప్రధానమైన ఓడరేవులు కూడా ఇక్కడ ఉన్నాయి. త్వరలో విజయవాడ విమానాశ్రయం కూడా అంతర్జాతీయస్థాయికి ఎదగనుంది. ఇన్ని వనరులున్నప్పుడు ఇక ఉత్తరాది వాళ్ల ఎంగిలిమెతుకుల కోసం ఆశపడాల్సిన ఖర్మ దక్షిణాది రాష్ట్రాలకు పట్టలేదు. ఇవి పూర్తి స్వయంసమృద్ధి సాధించ గలవు కూడా. ఇక్కడి సహజవనరులకు తోడు మానవ వనరులు కూడా అపారంగా ఉన్న విషయాన్ని గుర్తెరగాలి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారే. రిజర్వు బ్యాంకు గవర్నర్లుగాను, ఆర్థికశాఖలో ప్రముఖ స్థానాల్లోను కూడా ఎక్కువమంది దక్షిణాదివారే ఉంటున్నారు. ఇన్ని ఉన్న మనం వాళ్లను దేబిరించడం కంటే మన బతుకేదో మనం బతికేస్తే పోలా!!
                                                                                                                                    css mananam-సి ఎస్ ఎస్

English Title
do we need the northern help ?
Related News