మనషులకు వర్తించదు...

Updated By ManamSat, 09/22/2018 - 01:13
 Machinery

 Machineryపెరుగుతున్న ఉద్యోగావకాశాల పాత్ర, సునిశిత అవగాహన, క్లిష్టతర ఆలోచనా విధానం, నైపుణ్య విశ్లేషణల కోసం మన యువతరాన్ని తయారుచేసుకోవాలి. ఇప్పటివరకు అనుసరిస్తున్న ఇతరుల అంచానా విధానాల స్థానంలో మన అంచనా పద్ధతుల యంత్రాంగం, నమూనా తయారీ, విశ్లేషణలను మెరుగుపరుచుకోవాలి. పాఠశాలల్లో అభిజ్ఞ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేలా సంసిద్ధులం కావాలి. ఇందుకు నైపుణ్య సంస్థలు, ఉన్నత విద్యలోను ఈ రకమైన నైపుణ్య మెరుగుదల భవిష్యత్తు ఉద్యోగాలకు అత్యంతావశ్యకం. నాలుగో పారిశ్రామిక విప్లవంలో పయనించేందుకు మన యువతరాన్ని అనుమతించాలి. అందుకోసం ‘మనుషులకు వర్తింప చేయాల్సిన అవసరం లే’దనే నినాదంతో భవిష్యత్తు ఉద్యోగాల పరిస్థితి కల్పించాలి. 

మానవ విజ్ఞానం ఆకాశం అంచులకు చేరుకుంటున్న నేపథ్యంలో కొత్తకొత్త ఆవిష్కరణలకు తామ ఏర్పడుతోంది. ప్రస్తుతం ప్రపంచం నాలుగో పారిశ్రామిక విప్లవ కాలంలో మనం ఉన్నాం. మొదటి పారిశ్రామిక విప్లవమంటే యాంత్రికశక్తి, నీటి ఆవిరి కాలం. రెండో పారిశ్రామిక విప్లవమంటే విద్యుత్, సామూహిక ఉత్పత్తి కాలం, మూడో పారిశ్రామిక విప్లవంలో కంప్యూటర్, ఆటోవేుషన్ కాలం. ఇక నాలుగో పారిశ్రామిక విప్లవమంటే సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కాలం. ఈ నాలుగో సైబర్ పిజికల్‌‌ సిస్టమ్ కాలంలో మనిషికి ప్రత్యామ్నాయం మరబొమ్మ (రోబో)ల ద్వారా మానవ జీవితాన్ని నియంత్రిచడంగా అర్ధం చేసుకోవచ్చు. మానవ మేధస్సుకు చక్కని ఉదాహరణగా చెప్పుకునే ఈ నాలుగో విప్లవం కారణంగా ప్రస్తుతం మనిషి చేసే పనులను రోబోల ద్వారా చేయిం చడం వల్ల తమ ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశమున్నదనే భావం చాలామందిలో అభద్రతా భావం ఏర్పడింది. ఎంత మనిషి చేసే పనులన్నీ చేసినా మరమనిషిలో ఫిక్స్ చేసిన ప్రోగ్రామ్ మేరకు పనిచేయగలవే గానీ సొంత నిర్ణయాలు తీసుకోలేవు. అంటే మనిషికున్న విచక్షణ, ఆలోచనాశక్తి, భావోద్వేగాలు మరమనుషులకు ఉండవు. అదీగాక, ప్రతి పారిశ్రామిక విప్లవకాలంలోనూ తమ ఉద్యోగాల పట్ట ఇలాంటి అభద్రతా భావాలే వెలువడ్డాయి. కానీ, ఏ కాలానికి తగినట్లుగా ఆ కాలంలో మనిషి ‘అప్‌డేట్’ కావడం వల్ల త్వరలోనే ఆ అభద్రతా భావం కనుమరగైంది. ప్రస్తుత నాలుగో పారిశ్రామిక విప్లవకాలంలోనూ అదే పరిస్థితి పునరావృతమవుతుందని కృత్రిమ మేధస్సుకు పదునుపెడుతున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రోబో తనంత తాను నడవలేదు. మనిషి తనకున్న మేధస్సుతో సృష్టించడమైతే చేయగలడుగానీ, రోబో తనంత తానుగా ఏ పనీ చేయలేదు. దానికి బిగించిన ప్రో గ్రామ్ ప్రకారం ముక్కుకు సూటిగా వెళ్లినట్టుగా చేసుకుపోగలదుగానీ, మనిషిలాగా మంచీచెడులను ఆలోచించి నడుచుకోలేదు. అంటే రోబో విధానమంతా యాంత్రికవేునన్నమాట. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఏవిధం గా విద్యార్థులకు బోధన చేస్తారో అదే పద్ధతిలో యాంత్రిక బోధన కూడా కొనసాగుతోంది. ఈ యాంత్రిక బోధననే al gorithm అని అంటారు. ఫోటో తీసినట్టుగా ఒక వస్తువును ఇప్పుడు చాలా సులువుగా తయారు చేయవచ్చు. అలాంటి అంశాలు మనల్ని ఆశ్చర్యంలోను, విభ్రాంతిలోను ముంచెత్తుతాయి. మనకు ఆశ్చర్యంగా ఉండొచ్చుగానీ, అవెురికాలో ప్రస్తుతం రోబోల డ్రైవింగ్ సర్వసాధారణంగా మా రింది. 50 అవెురికా సంయుక్త రాష్ట్రాలకు 29 రాష్ట్రాల్లో రోబోల డ్రైవింగ్ మామూలు విషయమే. ఇది మనకు నమ్మలేని నిజంగానే కనిపించవచ్చు. కానీ పశ్చిమ దేశాల్లో కార్లు వాటంతటవే స్టార్ట్ అవుతాయి, డ్రైవర్ లేకుండానే రోడ్డెక్కుతున్నాయి. ఇలాంటి నమ్మలేని అంశాలు మన పరిశ్రమల్లో కూడా త్వరలోనే దృగ్గొచరం కాగలవు. 
ఇండస్ట్రీ 4.0 విజ్ఞానం ప్రస్తుతం ప్రపంచాన్ని ముంచెత్తుతోంది. తయారీ సాంకేతికరంగంలో (manu tacfurin technologies) స్వయం చలిత వ్యవస్థతో సూచనలు కల్పిం చడమే (automation and data exchange) ఇండస్ట్రీ 4.0 అంటే! దీన్ని నాలుగో పారిశ్రామిక విప్లవంగా చెప్పుకోవచ్చు. ఈ రంగంలో కొత్తగా సంభవిస్తున్న మార్పుల వల్ల ఎన్నో ఉద్యోగాలు కోల్పోతున్నామో ఊహించగలరా? అయి తే, మనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే గతంలో సంభవించిన పారిశ్రామిక విప్లవాలు ఎన్నో ఉద్యోగాలు కోల్పోయేలా చేశాయి. మరెన్నో ఉద్యోగావకాశాలను కల్పించాయన్నది వాస్తవం. అవెలా నూతన పరిణామాలకు దారితీయించాయో ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 కూడా అలాంటి పరిణామాలనే కొత్తపద్ధతిలో కలగజేస్తుంది. గతంలో లాగానే నైపుణ్యానికి డిమాండ్‌లో మార్పు కలిగిస్తుంది. 

 Machinery

మానవ జీవన క్రమాన్ని పరిశీలిస్తే- గతంలో ప్రయాణానికి కాలినడకను ఉపయోగించవాళ్లం. ఆ తరువాత గుర్రాల ద్వారా ప్రయాణించేవాళ్లం. ఇప్పుడు గుర్రాల స్థానంలో కార్లు వచ్చాయి. అంటే ఆయా కాలాల్ని బట్టి మానవ విజ్ఞానం అనేక మార్పులకు దోహదపడుతుందన్న మాట. ఈ పరిణామాల వెనుక రెండు కారణాలున్నాయి. ఒకటి- మనిషి మేధస్సు (చాతుర్యం - ingenuity), రెండోది కొత్తకొత్త పరిణామాల ఆహ్వానంలో నూతన పరిశోధనలకు ప్రయత్నించడం ద్వారా తనకున్న అవసరాన్ని (insatiability) తీర్చుకునేయత్నం. గతంలో కంప్యూటర్లు యుగం ప్రారం భవైున దశలో కంప్యూటర్‌కున్న డాక్యుమెంట్లు దాచుకునే వీలును చూసి తమ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందేమోనని లైబ్రేరియన్లు మొదట్లో భయపడ్డారు. ఆ తరువాత వారు కూడా కంప్యూటర్‌లోని పరిజ్ఞానాన్ని తెలుసుకుని దాని వినియోగంలో ఉన్న ప్రయోజనాలకు అలవాటు పడిపోయారు. అదేవిధంగా నగదు చెలామణిలో ఏటీఎంలు ప్రవేశించిన తరువాత బ్యాంకు ఉద్యోగులు కొంతవేురకు అయోమయంలో మునిగారు. అదే సమయంలో టెల్లర్ల సంఖ్య మూడో వంతుకు పడిపోవడంతో బ్యాంక్ శాఖలను పెంచాల్సి వచ్చింది. అంటే బ్యాంకుల బ్రాంచ్‌లను 40 శాతం పెంచాల్సివచ్చింది. దాంతో ఇతర ఖాతాదారులకు సేవలందించడంలో బ్యాంక్ ఉద్యోగులు యథాతథ ఉద్యోగబాధ్యతల్ని నిర్వర్తించడం ప్రారంభించారు. 

నూతన యాంత్రికయగంలో భౌతికంగా ఉత్పత్తి కంటే విజ్ఞానపరమైన ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఏర్పడుతోంది. అంటే విషయం (matter) కంటే అది బుద్ధి (mind) దే పైచేయి కావడమన్నమాట. సాంకేతికత విలువను పెంచుతుంది. ప్రస్తుతం మనం వికీపీడియా, గూగుల్ మొదలైన వాటి ద్వారా ఎంతో సమాచారం పొందుతున్నాం. గత పదేళ్ల కాలం నాటికంటే సం గీత పరిశ్రమ సగానికి సగం కుదించుకుపోయినప్పటికీ గతం లో కంటే మెరుగైన సంగీతాన్ని వినగలుగుతున్నాం. ఇవన్నీ మనకు ఇంటర్‌నెట్ ద్వారా ల భిస్తున్నాయి. ఇవాళ్టి చిన్నపిల్లవాడి ఆటస్థలం... 1990 నాటి సైనిక సూపర్ కంప్యూటర్ కంటే ఎంతో శక్తిమంతమైనది. ఇదెందుకంటే- మనం సరళమైన విధానంలో జీవిస్తున్నాము. లేదా కోరుకుం టున్నాము. అనంత విధానాలు ఆశ్చర్యం కలిగించే రీతిలోనే ఉంటాయి. అయితే, అన్ని ప్రాంతాల్లో వలెనే ఇండియాలో కూడా అలాంటి సాంకేతికతకు నైపుణ్య సామర్థ్యం అవసరం. యూనివర్సిటీల్లో ప్రవేశ పరీక్షలో రోబోలు విజయం సాధించాయి. నేటి విద్యావ్యవస్థ పూర్తిగా దోషపూరితంగా ఉందని జపాన్‌కు చెందిన ప్రొఫెసర్ అరాయ్ అభిప్రాయపడ్డారు. పదాలు, పాఠాల అర్ధాలు తెలుసుకోవడం పోయి తన కంప్యూటర్ తొడాయ్, ఇతర కృత్రిమ మేధోసంపత్తిపైనే విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఆమె చెప్పారు. పలితంగా సహజంగా మానవులకు ఉండే జ్ఞాపకశక్తి, ప్రజ్ఞను విస్మరిస్తున్నారు. ఇంజెక్టు చేసిన ప్రోగ్రామ్‌కు అనుగుణంగా చేసుకుపోయే రోబోల తీరులోనే వారు తమకున్న జ్ఞాపకశక్తిని, ప్రజ్ఞను వినియోగించకుండా చేసుకుపోతున్నారు. వాస్త వ పరిశీలనలో ఒక కంప్యూటర్‌తో మానవ మెదడు ఎన్నడూ పోటీపడదు. ప్రాజెక్టులను రూపొందించడంలోను, సమస్యల పరిష్కారంలోను మానవ మేధస్సు అద్వితీయంగా పనిచేస్తుంది. మనం చదవగలం, అర్థం చేసుకోగలం. ప్రొఫెసర్ అరయ్ అభిప్రాయం మేరకు, ఇప్పటి వరకు ఆ పనిని కం ప్యూటర్లు చేయలేవు. ‘అందువల్ల పిల్లలు ఆలోచించేలా ఉండే కొత్తరకం విద్యావిధానం గురించి మనం పరిశీలించాలి. అది వాస్తవాలను జమచేసే విధానం కాకూడదు. వాటిని విశ్లేషించి, క్లిష్టంగా ఆలోచించేలా ఉండాలి. అదే సమయంలో సమయం గడిచిపోకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రతిస్పందించ గలిగేలా ఉండాలి. 

భారత్ విషయానికొస్తే, ఇక్కడ బహుళ నాగరికతలు విస్తరించివుండడంతో అందరిలో ఇదెంతో ప్రాముఖ్యత సం తరించుకుంది. జపాన్‌లో ఒక రోబో ప్రవేశ పరీక్షను అధిగమిస్తే ఇండియాలో కూడా అలాగే సంభవిస్తుంది. నూతన సవాళ్లకు  ఇండియా నైపుణ్యాభివృద్ధి పర్యావరణ వ్యవస్థ బా ధ్యత వహించేలా ఉండాలి. ప్రస్తుతం పెద్దసంఖ్యలో పేరుకుపోయిన నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా ఇరుకైన, పున రావృతమైన, కనీస పర్యవేక్షణలకు సంబంధించి ఉద్యోగ పాత్రపై స్కిల్ ఇండియా దృష్టిపెట్టాలి. మానవ చాకిరీని తగ్గించే లక్ష్యంతో సాంకేతిక రంగం అభివృద్ధి చెందిన తరువాత పైన చెప్పినవే అనుసరించడంలో ఉన్న లక్ష్యం కావాలి.

రోబోలకు సామాజిక భావోద్వేగాలుండవు. టీమ్ వర్క్, సృజనాత్మకత, ఆవిష్కరణలు (వ్యవస్థాపకత) అనేవి రోబోలకు తెలియవు. సాంకేతిక ఉద్యోగాలు మరింత ఉన్నత సా దారణ నైపుణ్యాన్ని సాధించుకోవలసిన అవసరం ఉన్నది. ఈ అంశాన్ని భారతీయ ఐటీపరిశ్రమ గుర్తిస్తోంది. ఇక్కడ మనకు తలెత్తే ప్రశ్న ఏమిటంటే - స్కిల్ ఇండియా ఇందుకు సంసిద్ధంగా ఉన్నదా? అని. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 68వ దఫా సారాం శవేుమిటంటే- 49 శాతం కార్మికులు ప్రాథమిక విద్య, అంతకన్నా తక్కువే చదువుకున్నవారున్నారు. వీరిలో 27 శాతం నిరక్షరాశ్యులున్నారు. 16 శాతం మంది మాధ్యమిక విద్య కంటే తక్కువ విద్య ఉన్నవారు. కార్మికుల్లో 19 శాతం మాధ్యమిక విద్యను పూర్తిచేసినవారు. ఎనిమిది శాతం పట్టభద్రులున్నారు. 

సాంకేతిక విద్య పరుగులు తీస్తున్న నేపథ్యంలో తక్కువ విద్యార్హతలున్న కార్మికవర్గంతో మనమేం సాధిస్తాం? ఎలా ఈ పరుగుపందెంలో పరుగులుతీస్తాం? అంటే మనం దగ్గరి దారిలో పయనించాల్సి ఉంటుంది. ఇరుకైన మార్గంలో ప్రత్యేక నిపుణత సాధించేందుకు ప్రయత్నించాలి. పెరుగుతున్న ఉద్యోగావకాశాల పాత్ర, సునిశిత అవగాహన, క్లిష్టతర ఆలోచనా విధానం, నైపుణ్య విశ్లేషణల కోసం మన యువతరాన్ని తయారుచేసుకోవాలి. ఇప్పటివరకు అనుసరిస్తున్న ఇతరుల అంచానా విధానాల స్థానంలో మన అంచనా పద్ధతుల యంత్రాంగం, నమూనా తయారీ, విశ్లేషణలను మెరుగుపరుచుకోవాలి. టెక్ట్స్ పుస్తకాల్లోని విషయాలకు సాధారణ ప్రతిరూపణ (youtine replication) నేరుగా లభించదు. పాఠశాలల్లో అభిజ్ఞ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేలా సంసిద్ధులం కావాలి. ఇందుకు నైపుణ్య సంస్థలు, ఉన్నత విద్యలోను ఈ రకమైన నైపుణ్య మెరుగుదల భవిష్యత్తు ఉద్యోగాలకు అత్యంతావశ్యకం. నాలుగో పారిశ్రామిక విప్లవంలో పయనించేందుకు మన యువతరాన్ని అనుమతించాలి. అందుకోసం ‘మనుషులకు వర్తింప చేయాల్సిన అవసరం లే’ (humans need not apply) దనే నినాదంతో భవిష్యత్తు ఉద్యోగాల పరిస్థితి కల్పించాలి. 
 సంతోష్ మెహ్రోత్రా
(జెఎన్‌యూ ప్రొఫెసర్, ప్రముఖ రచయిత)

Tags
English Title
Does not apply to men ...
Related News