ఆ ఫేక్ అభ్యర్థుల లిస్ట్ నమ్మొద్దు: పొంగులేటి

Updated By ManamTue, 02/13/2018 - 15:26
MLC Ponguleti

MLC Ponguletiహైదరాబాద్: సోషల్ మీడియాలో కాంగ్రెస్ హై కమాండ్ ప్రిపేర్డ్ ప్రాపబుల్ లిస్ట్ హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌కు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నేతలు కుండ బద్ధలు కొడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి.. ఎవరో కాంగ్రెస్‌ను గందరగోళానికి గురిచేసేందుకు ఇలా లిస్ట్ పెట్టారని తెలుస్తోందన్నారు.

అధికార పార్టీ లబ్ది పొందే కుట్ర కోణం ఇందులో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఇందులో ఉన్న లిస్టు పేర్లలో వాగ్గేలా మిత్రసేన ఎప్పుడో మరణించారని ఆయన చెప్పారు. ఇలాంటివి నమ్మొద్దని.. కావాలని కొందరు దుష్ప్రచారాలు ఇలా చేస్తున్నారని..ఈ లిస్టును ఎవ్వరూ నమ్మకండని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఆయన సూచించారు. కాంగ్రెస్ క్యాడర్‌‌ను అయోమయానికి గురిచేయాలని చూస్తున్నారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

English Title
Don't Believe 2019 Elections Fake List Said Congress MLC Ponguleti
Related News