పొత్తులపై ఆలోచించొద్దు!

Updated By ManamMon, 02/19/2018 - 04:26
kodandaram

kodandaramహైదరాబాద్: టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం కోదండరాం మాట్లాడారు. పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, 200 మందితో పార్టీ సన్నాహక కమిటీ ఏర్పాటు చేశామని కోదండరామ్ అన్నారు.  మార్చి 10 లేదా 15న హైదరాబాద్‌ లేదా వరంగల్‌లో పార్టీ అవిర్భావ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడే పొత్తులపై ఆలోచించొద్దు, ఒంటరిగానే పోటీ చేశ్తామని కోదండరాం వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలు, నిరుద్యోగ సమస్య, రైతు అధ్యయన సదస్సులపై చర్చించామన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో నిరుద్యోగ సమస్యపై పోస్ట్‌కార్డ్‌ ఉద్యమాన్ని చేపడతామన్నారు. జిల్లా జేఏసీల ఆధ్వర్యంలో రైతు అధ్యయన సదస్సులు జరుగుతాయని తెలిపారు. మార్చి మొదటివారంలో మార్కెట్ యార్డుల సందర్శన ఉంటుందని ఆయన చెప్పారు.

English Title
dont think of alliances
Related News