నటుడి అరెస్ట్.. రోడెక్కిన ఇద్దరు భార్యలు

Updated By ManamMon, 09/24/2018 - 13:12
Duniya Vijay

Duniya Vijayవివాదాస్పద కన్నడ నటుడు దునియా విజయ్‌పై మరోసారి కేసు నమోదైంది. జిమ్ ట్రైనర్ మారుతి గౌడతో గొడవకు దిగి, ఆయనను కొట్టిన కేసులో విజయ్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో ఆయన పెద్ద భార్య నాగరత్న, చిన్న భార్య కీర్తి గౌడలు గొడవ పడ్డారు.

అయితే పెద్ద భార్య నాగరత్నకు ముగ్గురు పిల్లలుండగా.. ప్రస్తుతం విజయ్ చిన్నభార్య కీర్తిగౌడతో ఉంటున్నాడు. మారుతి గౌడతో గొడవ జరిగిన సమయంలో, పెద్ద భార్య కుమారుడు విజయ్‌తోనే ఉన్నాడు. తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆగ్రహానికి లోనైన నాగరత్న, కీర్తిగౌడ ఇంటికి వెళ్లి నిలదీయగా.. ఆమె బౌన్సర్లు నాగరత్నపై అనుచితంగా ప్రవర్తించారట. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసును నమోదు చేసుకునేలోపు.. కీర్తి గౌడ కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. నాగరత్నపై తన ఇంటిపై దాడి చేసిందని ఫిర్యాదు చేసింది. ఓ వైపు నటుడు అరెస్టై బెయిల్ కోసం తిరుగుతున్న సమయంలో ఆయన ఇద్దరు భార్యలు గొడవపడటం శాండిల్‌వుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Vijay Duniya

English Title
Duniya Vijay Arrested
Related News