బడుగువర్గాల బాంధవుడు

Updated By ManamWed, 09/26/2018 - 01:27
KONDA LAXMAN

imageబడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సహకారో ద్యమ పితామహుడు, తెలంగాణ ఉద్యమ నాయకు డు, నాటి స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి తెలం గాణ ఆత్మగౌరవ పోరాటం జరిపిన ధీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫా బాద్ తాలుకాలోని వాంకిడి గ్రామంలో కొండా హన్మ క్క పోషెట్టి బాపూజీ దంపతులకు లక్ష్మణ్ బాపూజీ 1915 సెఫ్టెంబర్ 27న  జన్మించారు. 

ఆదిలాబాద్ జిల్లా అప్పటికి, ఇప్పటికి వెనకబడి న ప్రాంతమే. అభివృద్ధి అంతంత మాత్రమే. ఆ ప్రాంతంimage వెనకబాటుతనాన్ని బాపూజీ చిన్నతనంలోనే గమనించాడు. అభివృద్ధి పరచాలని కాంక్షించాడు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉండే వాంకిడి ప్రజలు తెలుగుతో పాటు ఉర్దు, మరాఠీ బాషలు మాట్లాడేవారు,  బాపూజీ తండ్రి వాంకిడి గ్రామంలో ఉంటూ తపాలాశాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వ హిస్తుండేవారు. చిన్నప్పటీ నుంచే విద్యావంతుడు. తాలుకా పరిసర ప్రాంతాల్లో ఉర్దూభాష మాట్లాడటం తో పాటు చదవటం, రాయటం వచ్చిన వ్యక్తిగా గు ర్తింపు పొందారు. భాషాపరమైన విషయాల్లో ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచేవారు. దీంతో ఆయన అస లు పేరు మరచిపోయి ప్రజలు ‘బాపూజీ’ అని ఆప్యా యంగా పిలుచుకునేవారు. తర్వాతి కాలంలో తండ్రిని మించిన తనయుడిగా పేరుతెచ్చుకున్న కొండా లక్ష్మణ్ ను సైతం ప్రజలు ‘బాపూజీ’ అని ముద్దుగా అప్యా యంగా పిలుచుకునేవారు. 1986లో తిరుపతిలో జరి గిన రాష్ట్ర వెనుకబడిన తరగతుల సభలో సర్కారు జిల్లాల్లో వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేసినందుకు గౌతు లచ్చన్న, నిజాం కాలంలో కృషి చేసినందుకు లక్ష్మణ్ బాపూజీకి ఆచార్య అనే బిరుదు తో ప్రభుత్వం గుర్తించింది.

కొండా లక్ష్మన్ బాపూజీ 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురామానికిఘర్ లో బాల్యం గడిచింది. 1935లో ప్రాథమిక విద్యను ఆసిఫాబాద్‌లో పూర్తిచేసి పైచదువుల కొరకు హైదరా బాద్ వెళ్లారు. సిటీ కాలేజీలో చేరి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. న్యాయశాస్త్ర విద్య హైదరాబాదులో పూర్తి చేశారు. 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు. బాపూజీ విద్యార్ధి దశలోనే స్వతంత్ర సంగ్రామంలో చురుకైన పాత్ర నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా 1931లో గాంధీజీ మహరాష్ట్రలోని చాందా పట్టణాన్ని సందర్మించారు. అప్పట్లో నిజాం పాలనలో భాగంగా రాజురామానిక్‌ఘర్ పట్టణంలోని ఓ పాఠ శాలలో బాపూజీ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నా రు. సంస్థానంలో ఉప్పు సత్యాగ్రహంపై నిషేధం అమ లులో ఉంది. పాఠశాల యజమాన్యం సైతం సత్యాగ్ర హంలో పాల్గొనరాదని విద్యార్థులకు హుకూం జారీ చేసింది. అయితే బాపూజీ వీటన్నింటిని ధిక్కరించి చాందా పట్టణానికి వెళ్లి గాంధీజీని కలిసివచ్చారు. జాతిపిత ఉపన్యాసానికి ఎంతగానో ప్రభావితుడ య్యాడు. స్వగ్రామం చేరిన వెంటనే తను ధరించిన తెల్ల ప్యాంటు చింపి టోపీ కుట్టించుకున్నారు. నిజాం నిరకుంశ పాలన సాగుతున్న సమయంలో గాంధీజీని అనుసరిస్తూ తెల్లటోపి ధరించటమంటే సాహసోపేత మైన చర్యే. ఆనాటి నుంచి నేటివరకు బాపూజీ నెత్తిపై తెల్లటోపీ లేనిదే బయటకి వెళ్ళరు. పదహరవ ఏట ఖద్దరు ధరించి, తనువు చాలించేవరకు అదే ఖద్దరు లో దర్శనమిచ్చిన స్వదేశీ ఉద్యమకారుడు లక్ష్మణ్ బాపూజీ. 

బాలగంగాధర్ తిలక్ ఆదేశాల మేరకు హైదరా బాద్‌లో గణేష్  ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహిం చేందుకు తోడ్పాటు అందించేవారు. 1938లో రామా నంద  తీర్థ ఆద్వర్యంలో ఏర్పాటైన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో చేరి క్రియాశీల నాయకుడిగా ఎదిగారు.  కాంగ్రెస్ కార్యకర్తగా 1938లో సత్యాగ్రహ ఉద్యమం లో పాల్గొన్నారు.  అప్పటికి ఆయన వయసు 16 ఏళ్ళు మాత్రమే.  హైదరాబాద్ గౌలిగూడలో అప్పటి నాయకులు చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. మూడునెలలు జైలు జీవితం గడిపా రు. కాంగ్రెస్ పార్టీ తరపున నిజాం వ్యతిరేక ఉద్య మం, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నప్పటికీ, కమ్యూనిస్టులు సాగించిన సాయుధ రైతాంగ పోరాటానికి సైతం మద్దతిచ్చారు. తెలంగాణ సాయుధపోరాట కాలంలో క్రిమినల్ న్యాయవాదిగా విప్లవకారుల తరపున అనేక కేసులు వాదించారు. నిజాం ప్రభుత్వం నిర్బంధించిన వ్యక్తులకు పార్టీలతో నిమిత్తంలేకుండా న్యాయ సహాయం అందించారు. హుస్నాబాద్, విసునూర్ దేశ్‌ముఖ్‌పై హత్యాయత్నం వంటి కేసులెన్నింటినో వాదించి గెలిచారు. కమ్యూని స్టు నాయకులు రావి నారాయణరెడ్డి, నల్ల నర్సింహు లు, ఆరుట్లు రాంచంద్రారెడ్డి, జైని మల్లయ్య గుప్త, నయిజిందగీ సంపాదకులు ప్రొఫెసర్ కె.ఎస్. శర్మలపై ఉన్న కుట్రకేసులను వాదించి గెలిచారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అటు తర్వాత వందేమాతరం ఉద్యమంలో క్రియాశీలక పా త్ర పోషించారు. ఉద్యమాలు హైదరాబాద్ సంస్థా నంలో జరగకుండా నిజాంరాజు నిషేధించారు.  నిజాం ఆదేశాలను ధిక్కరించి ఊరేగింపు నిర్వహిం చాడు. సుల్తాన్ బజార్ పోస్టాఫీస్, బ్రిటిష్ రెసిడెన్సిపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రజాకార్ల ఆగడా లకు అంతులేని రోజుల్లో ప్రజలను చైతన్యపరిచేం దుకు బాపూజీ చైర్మన్‌గా ‘సిటీజన్ ప్రొటెక్షన్ కమిటీ’ ఏర్పడింది. రాష్ట్రం వెలుపలి ‘పహడి’ (కొండ) అనే పేరుతో బొంబాయి, షోలాపూర్‌లో ప్రచ్చన్న కార్య క్రమాలు నిర్వహించాడు. 1947 డిసెంబర్ 4న నారాయణరావు పవార్, గండయ్యల సహకారంతో నిజాం కారుపై బాంబులు విసిరారు. అయితే ఆ ప్రమాదం నుంచి నిజాంరాజు తృటిలో తప్పించుకు న్నారు. పవార్‌ను అక్కడే అరెస్టుచేయగా, కుట్రలో ఉన్నందున బాపూజీని ఏడో నిందితుడిగా చేర్చారు.   

1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో బాపూజీ ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యరిగా పోటీచేసి శాసనసభలోకి అడుగు పెట్టారు. డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా పనిచేశారు. కొండా లక్ష్మణ్ సమైక్యవాదిగా ఉండి ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం కృషి చేశారు.  తర్వాత కాలంలో సీమాంధ్ర నేతలు చేసిన అన్యాయాలను, అవమానాలను స్వ యంగా అనుభవించి తన అభిప్రాయాలను మార్చు కున్నారు. 1957లో నల్గొండ జిల్లా చిన్న కొండూర్ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ సమయంలోనే సంజీవరెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీనితో రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని నియమించాల్సిరాగా బాపూజీ పట్టుబట్టి దళితుడైన దామోదరం సంజీవ య్యను సీఎం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో పనిచేశారు.  

1958లో సచివాలయం సమీపంలో హుస్సేన్ సాగర్ తీరాన (ప్రస్తుత నెక్లెస్ రోడ్డుపై) జలదృశ్యం (ఇంటిని) నిర్మించుకున్నాడు. 1961లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు నల్గొండ జిల్లాలో 228 మైళ్ళ దూరం పాదయాత్ర నిర్వహించి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు.  1962 ఎన్నికల్లో నల్గొండ జిల్లా చిన్నకొండూర్ నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, కోర్టు ఆదేశాల మేరకు ఆ ఎన్నిక ను రద్దుచేస్తూ, 1965 తిరిగి ఉపఎన్నికలు నిర్వహించగా బాపూజీ ఘన విజయం సాదించారు. 1967 ఎన్నికల్లో సైతం  భువనగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాష్ట్ర మంత్రివర్గంలో కార్మిక శాఖ, జైలిశాఖ, చిన్నతరహా పరిశ్రమలు సమాచార శాఖలు నిర్వహించారు.  

1972 ఎన్నికల్లో సైతం బాపూజీ భువనగిరి నియోజకవర్గం గెలుపొందారు బాపూజీ. నెహ్రూ, ఇందిరాగాంధీలకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు.  అనేక సందర్భాలలో ఢిల్లీలో ఉంటూ జాతీయ రాజకీ యాల్లో కీలకపాత్ర పోషించారు. 1972లో ముఖ్య మంత్రి అభ్యర్థిగా పోటీపడ్డారు.  పి.వి.నర్సింహరావు, బాపూజీల పేర్లను అదిష్ఠానం పరిశీలించి చివరకు పి.వి.ని ముఖ్యమంత్రిగా చేసింది. రాష్ట్రంలో చెన్నా రెడ్డి, వెంగళరావుతో బద్ధవైరం ఉండేది. ఎమర్జెన్సీ తర్వాత జనతాపార్టీలో కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆ తరువాత కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తుదిశ్వాస విడిచే వరకు ఏ పార్టీలోను చేరలేదు. ఒకవైపు రాజకీయ జీవితం కొనసాగిస్తూనే, మరోవైపు సామాజిక ఉద్యమాన్ని కూడా నిర్మించారు. జాతీయ స్థాయిలో వెనుకబడిన కులాలను ఏకం చేయటంకోసం భారత వెనకబడిన కులాల సమాఖ్యను ఏర్పాటు చేశారు. బీసీలకు రా జ్యాధికారం దక్కాలని డిమ్యాండ్ చేశారు. కార్మికుల ను, చేతివృత్తుల వారిని సమీకరించి సహకారరంగం పరిధిలోకి తీసుకొచ్చారు. చేనేత, గీత, కమ్మరి, కుమ్మ రి, వడంగ్రి, గొర్లకాపర్లు, చర్మకారుల సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. 2012 సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లోని తన స్వ గృహంలో కన్నుమూశారు. 

- అంకం శ్రీనివాస్ నేత
9010992254
(రేపు కొండా లక్ష్మణ్ జయంతి)

English Title
Dynamic FOR POOR PEOPLE, AACHARYA KONDA LAXMAN BAPUJI
Related News