భూమి ఐక్యూ దారుణంగా పడిపోయింది

Updated By ManamWed, 03/14/2018 - 15:06
Earth IQ drastically dropped
Earth IQ drastically dropped

స్టీఫెన్ హాకింగ్ మరణంపై నాసా సహా ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆస్ట్రోనాట్లకు ఆనాడు చెప్పినట్టుగానే స్టీఫెన్ హాకింగ్ సూపర్ మాన్‌లా సూక్ష్మ గురుత్వాకర్షణలో ఎగిరిపోవాలని నాసా నాటి సంఘటనను గుర్తుచేసుకుంది. ‘‘ప్రముఖ భౌతిక శాస్త్ర పరిశోధకులు, సైన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిన స్టీఫెన్ హాకింగ్‌ను గుర్తు చేసుకునే సమయమిది. మనముంటున్న విశ్వం, ప్రపంచాన్ని వడగట్టేలా అందులో ఉన్న రహస్యాలను ఛేదించారాయన. హాకింగ్.. నువ్వు 2014లో స్పేస్ స్టేషన్‌లోని ఆస్ట్రోనాట్‌లకు చెప్పినట్టుగానే సూక్ష్మ గురుత్వాకర్షణలో సూపర్‌మేన్‌లా ఎగరాలని కోరుకుంటున్నాం’’ అని నాసా ట్వీట్ చేసింది.  

మరోవైపు ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనద్ మహీంద్ర స్పందిస్తూ.. ఆయన లేని ఈ ప్రపంచం ఒంటరైపోయింది అని ట్వీట్ చేశారు. ‘‘స్టీఫెన్ హాకింగ్ మన మధ్యే ఉంటూ విధిని, చెడు రాతలను ఎలా జయించాలో మనకు నేర్పారు. ఆయన లేని ఈ ప్రపంచం ఒంటరైపోయింది’’ అని ఆయన ట్వీట్ చేశారు.

కాగా, భూమి ఐక్యూ స్థాయులు దారుణంగా పడిపోయాయని ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ అన్నారు. ‘‘స్టీఫెన్ హాకింగ్ లాంటి జ్ఞాని చనిపోవడంతో భూమి ఐక్యూ స్థాయులు గణనీయంగా పడిపోయాయి. మనమే కాదు, రాబోయే శతాబ్దాల్లో తర్వాతి తరం వారు ఆయన్ను మిస్ అవుతూనే ఉంటారు’’ అని ట్వీట్ చేశారు. 

English Title
Earth IQ drastically dropped
Related News