మరో పది రోజుల్లో భూమి అంతం..?

Updated By ManamSat, 04/14/2018 - 11:28
World end

World ‘‘మరో పది రోజుల్లో భూమి అంతం కానుంది. ఈ లోపు మీ కోరికలు ఉంటే తీర్చుకోండి’’ అంటూ ప్రముఖ కాన్‌స్పిరసీ థియరిస్టు ‘డేవిడ్ మీడే’ అన్నారు.  ఇంతకుముందు కూడా చాలా సార్లు భూమి అంతం అవుతుందంటూ చెప్పిన మీడే.. ఈ సారి మాత్రం పాత ఉదాహారణలు అయిన నిబిరు, ప్లానెట్‌ ఎక్స్‌తో పాటు జోంబీ గ్రంథాన్ని కూడా ఆధారం చేసుకుని మరి ఈ ప్రకటన చేశారు. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా బైబిల్‌లో చెప్పిన ప్రకారం ఈ నెల 23న రాత్రి 12 గంటల ఒక నిమిషానికి ఈ విపత్తు సంభవించనున్నట్లు డేవిడ్ మీడే చెప్పారు.

మరోవైపు ఏప్రిల్ 23న సూర్యుడు కన్య రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు ఒకే క్రమంలోకి వస్తారని అప్పుడు ఏవైనా ఉపద్రవాలు సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు. అయితే అది భూఅంతం అవుతుందని అనలేమని అంటున్నారు. కాగా మీడే మాత్రం ఆ రోజు కచ్చితంగా భూమి అంతం అవుతుందని చెబుతున్నారు. 

English Title
Earth will destroy on April 23rd..?
Related News