పిల్లలకు కళల పట్ల అవగాహన

Updated By ManamThu, 08/23/2018 - 02:27
kadiyam srihari
  • ఆట బాలోత్సవ్ బ్రోచర్‌ను విడుదల చేసిన మంత్రి కడియం 

kadiyamహైదరాబాద్: పిల్లలకు చదువుతో పాటు వివిధ కళల పట్ల అవగాహన కల్పించేందుకు ఆట బాలోత్సవ్ ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మంత్రి తన నివాస సముదాయంలో ఉపాధ్యాయ సంఘాలు, ఉత్తమ ఉపాధ్యాయుల సంఘం సంయుక్తంగా నవంబర్ 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ఆట బాలోత్సవ్ బ్రోచర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి జాతీయ స్థాయి ఉత్సవాల్లో పాల్గొనడం పిల్లలకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ ఉత్సవాల్లో దేశంలోని 10 రాష్ట్రాల పిల్లలు కళాకారులు పాల్గొంటున్నాయని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 24 అంశాలు, 54 విభాగాల్లో వివిధ కార్యక్రమాలను రూపొందించినట్టు చెప్పారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే ప్రతిఒక్కరికీ సర్టిఫికెట్‌ను అందిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు, పిల్లలకు భోజన వసతి కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు సర్వోత్తమరెడ్డి, బి.కమలాకర్‌రావు, రంగాచార్యులు, జనార్దన్, పేర్లి దాసు, హరి కోటి, కెఎస్.నాయుడు, సుధాకర్, చక్రవర్తి, శిరీష, మురళి, యోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

English Title
Educate children for arts
Related News