సుమంత్ సరసన తెలుగమ్మాయి

Updated By ManamWed, 03/14/2018 - 12:53
Sumanth

eesha rebba, sumanth'మళ్లీరావా'తో మళ్లీ ఫాంలోకి వచ్చిన అక్కినేని హీరో సుమంత్ తన 25వ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఉగాది రోజున ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సుమంత్ సరసన హీరోయిన్‌గా తెలుగమ్మాయి ఈషారెబ్బా నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇక లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తుండగా.. ధీరజ్ బొగ్గారం, సుధాకర్ రెడ్డి బీరమ్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

English Title
Eesha Rebba To Romance Sumanth
Related News