ధూంధాంగా ఎన్నికల ప్రచారం

Updated By ManamSun, 09/23/2018 - 01:45
 Irani to create a women's blend
  • దూకుడు పెంచనున్న బీజేపీ 

  • రంగంలోకి ప్రధాని, కేంద్ర మంత్రులు

  • కరీంనగర్ సభకు రానున్న అమిత్ షా

  • మహిళా సమ్మేళనానికి సృ్మతీ ఇరానీ

smrithiహైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచార దూకుడును పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార హోరుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు పకడ్బందీగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలను ఉపయోగించుకోవాలని రాష్ట్ర అధినాయక త్వం యోచిస్తోంది. ఈ మేరకు బహిరంగ సభల షెడ్యూలు, పాల్గొనవల్సిన అగ్రనేతల జాబితాను అధిష్టానికి పంపినట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణ వ్యాప్తంగా 50సభలు నిర్వహించాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయిచింది. ఇందులో భాగంగానే మహబూబ్‌నగర్‌లో జరిగిన సభతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో ఆ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. దీంతో దక్షిణ తెలంగాణలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. ఇక అక్టోబర్ మొదటి వారంలో ఉత్తర తెలంగాణ  కరీంనగర్‌లో రెండో సభను నిర్వహించి, అక్కడా జోష్ పెంచాలనే ఆలోచనలో పార్టీ ఉంది. ఈ సభకు అమిత్ షా హాజరుకా నున్నారు. దీనికి సంబంధించి బీజేపీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 27వ తేదీన దుబ్బాక నియోజకవర్గంలో జరగనున్న మహిళా సమ్మేళనానికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ హాజరుకానున్నారు. అదే విధంగా పార్టీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి సంతోష్ ఇక్కడే తిష్ట వేసి, పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదపు మూడు సభలకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉన్న ట్టు తెలుస్తోంది. ఇందులో ఒకటి హైదరాబాద్‌లో, మిగతా రెండు జిల్లాల్లో జరిగే సభల్లో పాల్గొంటారని సమాచారం. ఆయనతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా ప్రచారానికి ఉపయోగించుకోనున్నట్టు సమాచారం.

టీఆర్‌ఎస్ వైఫల్యాలు, కేంద్ర పథకాలపై.. 
కేంద్ర మంత్రులు, దేశంలోని అన్ని రాష్ట్రాల సీనియర్లు రాష్ట్రంలో నిర్వహించే వివిధ సభలు, సమావేశాల్లో ర్యాలీల్లో పాల్గొనే అవకాశం ఉంది. వీరంతా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయనున్నారు. కేంద్రం.. రాష్ట్రానికి చేసిన కార్యక్రమాలు, ఇచ్చిన నిధులు, అనుమతులు, వివిధ అంశాలపై ప్రజలకు వివరించనున్నారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. టీఆర్‌ఎస్ నియంతృత్వ, నిరంకుశ, కుటుంబ, అవినీతి పాలనపై పెద్ద ఎత్తు ప్రచారం చేపడతామని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు.

English Title
Election campaign
Related News