11న తెలంగాణకు ఈసీ ప్రతినిధులు

Updated By ManamFri, 09/07/2018 - 18:26
Election Commission team to visit Telangana
Election Commission team to visit Telangana

న్యూఢిల్లీ : తెలంగాణ శాసనసభ రద్దు అయిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అంచనా వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలోని ఎన్నికల నిర్వహణపై ఈ బృందం అంచనా వేసి ఓ నివేదిక ఇవ్వనుంది.  

సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉమేశ్ సిన్హా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతినిధి బృందం హైదరాబాద్ రానుంది. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ బృందం అధ్యయనం చేయనుంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఇవాళ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు.

గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన తెలంగాణ ప్రతిపక్షాలు
మరోవైపు తెలంగాణలోని ప్రతిపక్షాలు గవర్నర్ నరసింహన్ అపాయింట్‌మెంట్ కోరాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను కొనసాగించవద్దని గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్నాయి.. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌లతో కూడిన అఖిలపక్షం గవర్నర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

English Title
Election Commission team to visit Telangana to review poll preparedness
Related News